‘పెద్ది’ Movie మేనియా ప్రారంభం పెద్ది Powerప్లే టూర్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మచ్ అవైటెడ్ రూరల్ యాక్షన్`స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’పై రోజురోజుకీ అంచనాలు మరింత పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా భారీ ప్రమోషన్స్‌తో చిత్రబృందం సినిమాపై హైప్‌ను మరో స్థాయికి తీసుకెళ్తోంది.ఇప్పటికే విడుదలైన రెండు హై`వోల్టేజ్ పాటలు, రెండు విభిన్న గ్లింప్సెస్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో సినిమాపై భారీ బజ్ ఏర్పడింది.  బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై నిర్మాత వెంకట సతీష్ కిలారు భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మÖవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పిస్తున్నాయి. ‘పెద్ది’ జూన్ 4న గ్రాండ్ పాన్ ఇండియా రిలీజ్‌కు సిద్ధమవుతుండగా, జూన్ 3న స్పెషల్ ప్రీమియర్స్ ప్రదర్శించనున్నారు. ఇదిలా ఉండగా, ఇప్పటివరకు ఎప్పుడూ చూడని రీతిలో పాన్ ఇండియా ప్రమోషనల్ క్యాంపెయిన్‌ను టీమ్ ప్రారంభించింది.

‘పెద్ది పవర్‌ప్లే టూర’ మే 18న ముంబైలో గ్రాండ్ ట్రైలర్ లాంచ్‌తో ప్రారంభం కానుంది. అన్ని ప్రధాన భాషల్లో థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. అక్కడి నుంచి ఈ ప్రమోషనల్ క్యాంపెయిన్ మరింత జోరందుకోనుంది. మే 22న ఉప్పల్ స్టేడియంలో జరగనున్న Sఖీఊ లబ ఖీఅః మ్యాచ్ సందర్భంగా చిత్రబృందం ప్రత్యేకంగా హాజరుకానుండటం ప్రధాన ఆకర్షణగా మారనుంది. అనంతరం మే 23న భోపాల్, మే 24న బెంగళూరు, మే 28న ఢిల్లీ, మే 30న చెన్నై, జూన్ 1న విజయనగరం, జూన్ 2న హైదరాబాద్‌లో భారీ ఈవెంట్స్ నిర్వహించనున్నారు. అంతేకాదు, సమ్మర్ అంతా హైప్ కొనసాగించేలా మరిన్ని సర్‌ప్రైజ్‌లు కూడా సిద్ధం చేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు.

“ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఇంకా ఎన్నో సర్‌ప్రైజ్‌లు సిద్ధంగా ఉన్నాయి. విÖకు అల్టిమేట్ సమ్మర్ ట్రీట్ అందించడానికి మేము ఎంతో కష్టపడ్డాం. విÖ హాలిడేస్‌ను ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో నింపేందుకు జూన్ 4న ముందుగానే వస్తున్నాం. మా టీమ్ ప్రతి ఫ్రేమ్‌లో మనసు పెట్టి పని చేసింది. బిగ్ స్కీన్ పై విÖరు ఈ అనుభూతిని ఆస్వాదించేందుకు మేము ఎంతగానో ఎదురుచూస్తున్నాం” అని మేకర్స్ తెలిపారు.

ఇప్పటివరకు ఎప్పుడూ చూడని ఈ భారీ ప్రమోషనల్ క్యాంపెయిన్ సినిమాపై అంచనాలను మరింతగా పెంచి ‘పెద్ది’ను మరో స్థాయికి తీసుకెళ్లనుంది.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....