హైదరాబాద్, ఆగష్టు 01 (ఇయ్యాల తెలంగాణ) : ఉపకుల వర్గీకరణ తీర్పుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్రావు స్పందించారు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు కౌరవుల సభ మాదిరిగా నడుస్తున్నాయని విమర్శించారు. అంతిమంగా పాండవులే గెలిచారని ఇప్పుడు కూడా తామె గెలుస్తామని అన్నారు. ఎస్సీ వర్గీకరణపై సీఎం తప్పుడు సమాచారాన్ని సభలో చెప్పారని ఫైర్ అయిన హరీష్… టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అసెంబ్లీలో తీర్మానం చేసి ప్రధానిని కలిసి వర్గీకరణ చేపట్టాలని కోరామన్నారు. ఆరోజు ప్రధాని కూడా సానుకూలంగా స్పందించారని గుర్తు చేశారు. ఎస్సీ వర్గీకరణ కోసం చాలా మంది ప్రాణ త్యాగం కూడా చేశారని వివరించారు. వర్గీకరణపై స్టాండ్ ఏంటో చెప్పాలని గాంధీభవన్ వద్ద ఉద్యమకారులు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేస్తే నాడు కాంగ్రెస్ పట్టించుకోలేదని విమర్శించారు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మకను స్వాగతిస్తున్నామన్నారు.
- Homepage
- Telangana News
- SC/ST ఉపకుల వర్గీకరణ తీర్పును స్వాగతిస్తున్నాం: హరీష్రావు
SC/ST ఉపకుల వర్గీకరణ తీర్పును స్వాగతిస్తున్నాం: హరీష్రావు
Leave a Comment
Related Post