RTC డ్రైవర్ శంకర్ గౌడ్ అంత్యక్రియల్లో ఉద్రికత్త

వరంగల్ , ఏప్రిల్ 23 (ఇయ్యాల తెలంగాణ) : ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ అంత్యక్రియల్లో ఉద్రికత్త నెలకొంది. శంకర్ గౌడ్ శవాన్ని నర్సంపేట డిపోకు తరలించాలని  కుటుంబ సభ్యులు కోరారు. డిపోకు తీసుకొస్తే శంకర్ గౌడ్ కు నివాళి అర్పించే అవకాశాన్ని కల్పించాలని కార్మికులు కోరారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలున్నందున పోలీసులు ససేమిరా ఒప్పుకోలేదు. శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని వెల్లడించారు. పోలీసుల తీరుపై కేంద్ర మంత్రి మండి సంజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేసారు. మానవత్వం లేకుండా వ్యవహరిస్తే ఎలా అని మండిపడ్డారు. కుటుంబ సభ్యుల విజÊఝప్తిని మన్నించాలని సూచించారు. పోలీసుల వినకపోవడంతో కుటుంబ సభ్యులు, బీజేపీ శ్రేణులు, కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేసారు. సీఎంకు, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేసారు. శంకర్ గౌడ్ శవాన్ని నర్సంపేటకు తరలించేందుకు బలవంతంగా బయటకు తీసుకొచ్చారు. ఈ నేపధ్యంలో పోలీసులకు, కార్యకర్తలు, కార్మికుల మధ్య పెనుగులాట జరిగింది. నడిరోడ్డుపైనే శంకర్ గౌడ్ శవాన్ని ఉంచారు న పోలీసులు. కోపోద్రిక్తులైన కార్యకర్తలు శవపేటికను తీసేసి శవాన్ని ఎత్తుకుని అంబులెన్స్ లోకి ఎక్కించే యత్నం చేసారు. తరువాత పోలీసులు శంకర్ గౌడ్ శవాన్ని మళ్లీ తమ ఆధీనంలోకి తీసుకున్నారు. శవాన్ని తీసుకెళ్లి ఏం చేసుకుంటారో చేసుకోండంటూ కుటుంబ సభ్యులు అన్నారు. కేంద్ర మంత్రితో పోలీస్ కమిషనర్ మంతనాలు జరిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు శంకర్ గౌడ్ కుటుంబ సభ్యుల జేఏసీ నాయకులతో చర్చలు జరిపారు. శంకర్ గౌడ్ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని హావిÖ, ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను పరిష్కరిస్తామని భరోసా ఇవ్వండంతో అందరూ శాంతించారు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....