హైద్రాబాద్ , జూన్ 6 (ఇయ్యాల తెలంగాణ) : భానుడి భగభగలతో ఉక్కిరిబిక్కిరవుతున్న భాగ్యనగరాన్ని వరుణుడు కరుణించాడు. నైరుతి రుతుపవనాల రాకతో హైదరాబాద్ వ్యాప్తంగా పలుచోట్ల వర్షం కురిసింది. ఫలితంగా ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. జూబ్లీహిల్స్, ఫిలింనగర్, బోరబండ, యÖసఫ్‌గూడ, ఎస్?ఆర్?నగర్, సనత్‌నగర్, రాయదుర్గం, మాదాపూర్, గచ్చిబౌలి, ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్ నగర్, గౌలిపురా, ఉప్పుగూడ,కందికల్ గేట్, చాంద్రాయణగుట్ట ప్రాంతాల్లో వర్షం కురుసింది. హైదర్‌గూడ, ఉప్పరపల్లి పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. ఈ వాన జల్లులతో నగరవాసులకు ఉపశమనం లభించినటె్టౖంది. ఇంకోవైపు రంగారెడ్డి జిల్లా కోహెడ, పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.