September 4th మాంసం బీఫ్ Shops మూసివేత

 జీహెచఎంసీ ఆదేశాలు

 హైదరాబాద్, సెప్టెంబర్ 03 (ఇయ్యాల తెలంగాణ) : శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని 04 సెప్టెంబర్ 2026న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచఎంసీ) పరిధిలోని అన్ని గొర్రెలు, మేకలు మరియు పశువుల కబేళాలతో పాటు రిటైల్ మాంసం & బీఫ్ దుకాణాలను మూసివేయాలని జీహెచఎంసీ ఆదేశాలు జారీ చేసింది.జీహెచఎంసీ చట్టం, 1955లోని సెక్షన్ 533(బి) కింద జారీ చేసిన నోటీసు ప్రకారం, శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదిన ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. జీహెచఎంసీ కమిషనర్  ఆర్.వి. కర్ణన్, జీహెచఎంసీ పరిధిలోని అన్ని గొర్రెలు, మేకలు మరియు పశువుల కబేళాలు, మాంసం & బీఫ్ దుకాణాల మూసివేతను సమర్థవంతంగా అమలు చేయడంలో మున్సిపల్ అధికారులకు పూర్తి సహకారం అందించాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్లను కోరారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....