“మహేంద్రగిరి వారాహి” Movie టీజర్ Release

రాజశ్యామల ఎంటర్టైన్మెంట్స్ & బ్రిడ్జ్ ఫిలిమ్స్ బ్యానర్స్ పై సుమంత్ హీరోగా సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో మధు కాలిపు, లక్క్ష్మణ్ నిర్మాతలుగా తెరకెక్కుతున్న చిత్రం మహేంద్రగిరి వారాహి.  ఈ మÖవీ టీజర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది,  ఈ కార్యక్రమానికి దర్శకుడు అనిల్ రావిపూడి,  నిర్మాత సుప్రియ యార్లగడ్డ ముఖ్య అతిథులుగా విచ్చేసారు.

ఈ సందర్బంగా దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ “మహేంద్రగిరి వారహి టీజర్ చాలా బాగుంది, పాజిటీవ్ ఫీలింగ్ కలిగింది, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో సూపర్ మÖ్యజిక్ తో టీజర్ ఉంది,  థియేటర్స్ లో ఈ సినిమా విజయం సాధిస్తుందని అనిపిస్తుంది, రంగమార్తాండ సినిమా తీసిన మంచి అభిరుచిగల  నిర్మాత మధు గారు ఈ సినిమాను తీశారు అలాగే లక్క్ష్మణ్ గారు ఈ సినిమాకు మరో నిర్మాత ఆయనకు నా బెస్ట్ విషెస్ తెలుపుతున్నాను, అనుప్ రూబెబ్స్ సూపర్బ్ రీ రికార్డింగ్ ఇచ్చారు,  సంతోష్ జాగర్లపూడి విజన్ బాగుంది, ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో అద్భుతమైన పాత్రలు పోషించిన సుమంత్ గారు ఈ సినిమాతో మరో బిగ్గెస్ట్ హిట్ కొట్టాలని కోరుకుంటున్నను “ అన్నారు.

మహేంద్రగిరిలో కొలువుదీరిన వారాహి అమ్మవారి ఆలయం చుట్టూ తిరిగే కధాంశాన్ని ఆధారంగా చేసుకుని దర్శకుడు సంతోష్ జాగర్లపూడి ఈ సినిమాను రూపొందిస్తున్నారు. 

సుమంత్ , విÖనాక్షి గోసామి, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, రాజీవ్ కనకాల, కమల్ కామరాజు, సత్యసాయి శ్రీనివాస్, వంశీ చాగంటి, మంజు భార్గవి తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకు కథ మురళి.

ఈ చిత్ర టీజర్ పై సోషల్ విÖడియాలో ఆసక్తి నెలకొంది, మహేంద్రగిరి వారాహి టీజర్ విజువల్ గా ఆకట్టుకుంటుంది, రిచ్ విజువల్స్ మరియు ప్రామిసింగ్ సీజి వర్క్ తో గ్రాండ్ గా ఈ టీజర్ ఉందని అంటున్నారు , టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది.

ఒక శాపం వెనుక ఉన్న రహస్యాన్ని, ఒక ఊరిలో జరుగుతున్న వరుస చావుల మిస్టరీని ఛేదించే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా సుమంత్ రోల్ ఉండబోటింది . అసలు ఆ శాపం వెనుక కథ ఏంటి.. ? ఆ శాపం ఎప్పుడు పోతుంది.. ? సుమంత్ కి హెల్ప్ చేసే ఐశ్వర్య రాజేష్ ఎవరు.. ? అనేది సినిమాలో ఆసక్తికరంగా ఉండబోతోంది . విజువల్స్ చాలా గ్రాండ్‌గా, ముఖ్యంగా వారాహి అమ్మవారి ఉగ్రరూపం చూపించిన షాట్స్ ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పిస్తాయి.అనుప్ రూబెన్స్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, వారాహి మంత్రం టీజర్‌ను సరికొత్త లెవెల్‌కు తీసుకెళ్లాయి. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది, నిర్మాతలు మధు,  లక్క్ష్మణ్ సినిమాను అద్భుతంగా తెరాకెక్కించారు. 

సుమంత్ కు తన కెరీర్ లో మహేంద్రగిరి వారాహి సినిమా ఒక మైలు రాయిగా నిలిచిపోయే సినిమాగా నిర్మాత కాలిపు మధు ఈ సినిమాను రూపొందించారు, దర్శకుడు సంతోష్ జాగర్లపూడి ఈ సినిమాను విజువల్ వండర్ గా తెరకెక్కించారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....