Aviation రంగం నుంచి నటన వైపు ప్రార్థనా చాబ్రియా !

ప్రార్థనా చాబ్రియా ఇక ఆకాశంలో విమానాన్ని నడిపే పైలట్‌గా మాత్రమే కాదు.. వెండితెరపై నటిగా కూడా తన ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నారు. ట్రైనర్ గ్రేడ్ పైలట్‌గా పనిచేసిన ప్రార్థనా చాబ్రియా ఇప్పుడు సినీ రంగంలోకి నటిగా అడుగు పెడుతున్నారు.  ఆమె నటిగా అరంగేట్రం చేస్తున్న ‘చిరో’ అనే తమిళ చిత్రం 2026లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

నటన పరంగా ఆది శక్తి అనే యాక్టింగ్ స్కూల్ నుంచి ప్రత్యేకంగా శిక్షణ పొందిన ప్రార్థనా చాబ్రియా.. క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసంతో ఇప్పుడు వెండితెరపై తనదైన ముద్ర వేయడానికి సిద్ధమవుతున్నారు. విమానాలను నడిపిన పైలట్‌గా నుంచి కెమెరా ముందు నటిగా మారిన ఆమె ప్రయాణం ఇప్పటికే సినీ వర్గాల దృష్టిని ఆకర్షిస్తోంది.

ప్రార్థనా చాబ్రియా నటనతో పాటు పోల్ డ్యాన్స్, బెల్లీ డ్యాన్స్‌లోనూ మంచి ప్రావీణ్యం కలిగి ఉన్నారు. దీంతో సంప్రదాయబద్ధమైన పాత్రలకు మాత్రమే కాకుండా విభిన్నమైన పాత్రలను పోషించే సామర్థ్యం ఆమెకు ఉందని తెలుస్తోంది. అలాగే సింథి, హిందీ, తమిళం, ఇంగ్లీష్ భాషల్లో అనర్గళంగా మాట్లాడగలిగే ప్రార్థనా .. భవిష్యత్తులో పాన్ ఇండియా, సౌత్ ప్రాజెక్టులతో పాటు తెలుగు చిత్ర పరిశ్రమలోకి కూడా అడుగుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

‘చిరో’ చిత్రం పండుగ రిలీజ్‌కు ద్ధమవుతుండగా.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఏవియేషన్ రంగం నుంచి నటన వైపు ప్రార్థనా చాబ్రియా చేస్తున్న ఈ ప్రయాణం, ఈ ఏడాది సౌత్ ఇండస్టీలో అరంగేట్రం చేస్తున్న కొత్త నటీనటుల్లో ప్రత్యేకంగా మారుతోంది.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....