‘అనుమాన పక్షి’ Movie నుంచి అతిగా ఆలోచించకురా Song రిలీజ్

‘డిజె టిల్లు’ చిత్రంతో సెన్సేషనల్ డెబ్యూ చేసిన దర్శకుడు విమల్ కృష్ణ, రాగ్ మయÖర్ కథానాయకుడిగా నటిస్తున్న మరో యునిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘అనుమాన పక్షి’తో అలరించబోతున్నారు. చిలక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక, రాజేష్ జగ్తియాని, హీరాచంద్ దండ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే టీజర్, విభిన్నమైన ప్రమోషనల్ కంటెంట్ ఆసక్తిని పెంచింది.

తాజాగా ‘అతిగా ఆలోచించకురా’ అనే ఫన్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పాట సినిమా హీరో క్యారెక్టర్‌ను ఫన్‌గా ప్రజెంట్ చేస్తోంది. క్యారెక్టర్ స్వభావాన్ని, అతని ఆలోచనా విధానాన్ని సరదాగా చూపిస్తూ పాట సాగుతుంది. పాట విడుదలైన వెంటనే మంచి ఆసక్తిని క్రియేట్ చేస్తోంది. ఈ పాటకు శ్రీచరణ్ పాకాల ఆకట్టుకునే ట్యూన్  సమకూర్చారు. సాన్వి, రవి ప్రకాష్ చోడిమళ్ల కలిసి ఆలపించారు. కిట్టు విస్సాప్రగడ సాహిత్యం అందించారు.

‘డీజే టిల్లు’తో తనదైన క్యారెక్టరైజేషన్, హ్యూమర్‌తో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు విమల్ కృష్ణ ‘అనుమాన పక్షి’తో మరో వైవిధ్యమైన కాన్సెప్ట్‌ను తెరకెక్కిస్తున్నారు.

ఈ చిత్రంలో మెరిన్ ఫిలిప్ కథానాయికగా నటిస్తుండగా, ప్రిన్స్ సెసిల్, రాశి, అనన్య, చరిత్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

సినిమాటోగ్రాఫర్ సునీల్ కుమార్ నామా,  శ్రీచరణ్ పాకాల మÖ్యజిక్ అందిస్తున్నారు. జేకే మÖర్తి ఆర్ట్ డైరెక్టర్‌గా, అభినవ్ కునపరెడ్డి ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

‘అనుమాన పక్షి’ సెప్టెంబర్ 18న థియేటర్లలోకి రానుంది.

తారాగణం: రాగ్ మయÖర్, మెరిన్ ఫిలిప్, ప్రిన్స్ సిసిల్, అనన్య, చరిత్, బ్రహ్మాజీ, రాసి, అజయ్, మస్త్ అలీ

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....