కోల్ కత్తా, మే 14 (ఇయ్యాల తెలంగాణ) : పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, తృణమÖల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ గురువారం అందరినీ ఆశ్చర్యపరిచారు. తన ట్రేడ్ మార్క్ తెల్ల చీరను పక్కన పెట్టి, అడ్వకేట్ గౌన్ ధరించి కలకత్తా హైకోర్టులో ప్రత్యక్షమయ్యారు. రాష్ట్రంలో ఎన్నికల అనంతర హింసకు సంబంధించి దాఖలైన ఒక కేసు విచారణ కోసం ఆమె స్వయంగా న్యాయవాది దుస్తుల్లో హాజరయ్యారు. ఒక ప్రజా నాయకురాలిగా కాకుండా, చట్టం తెలిసిన అడ్వకేట్‌గా ఆమె కోర్టు హాజరయ్యారు. మమతా బెనర్జీకి న్యాయవాద వృత్తితో పాత అనుబంధమే ఉంది. ఆమె 1982లో కోల్‌కతాలోని జోగేష్ చంద్ర చౌదరి లా కాలేజీ నుండి ఎలఎల్‌బీ పట్టా పొందారు. కలకత్తా హైకోర్టు బార్ అసోసియేషన్ డైరెక్టరీలో కూడా ఆమె పేరు నమోదై ఉంది. చట్టపరమైన నిబంధనల ప్రకారం, లా గ్రాడ్యుయేట్ అయిన ఎవరైనా ఒక క్లయింట్ తరపున వాదించేటప్పుడు మాత్రమే అడ్వకేట్ రోబ్ ధరించడానికి అనుమతి ఉంటుంది. ఈ క్రమంలోనే ఆమె ఒక న్యాయవాదిగా కోర్టుకు హాజరయ్యారు.
ఈ పరిణామంపై సోషల్ విÖడియాలో భిన్నమైన స్పందనలు వస్తున్నాయి. కొందరు నెటిజన్లు ఇది చాలా రిఫ్రెషింగ్ గా ఉందని, ఒక నాయకురాలు తన వృత్తిపరమైన నైపుణ్యాన్ని ఇలా ప్రదర్శించడం బాగుందని ప్రశంసిస్తున్నారు. అయితే, విమర్శకులు మాత్రం ఇది కేవలం పొలిటికల్ షో అని కొట్టిపారేస్తున్నారు. తృణమÖల్ కాంగ్రెస్ మాత్రం ఈ విషయాన్ని గర్వంగా చెప్పుకుంటోంది. బెంగాల్ ప్రజల కోసం పోరాడే క్రమంలో మమతా బెనర్జీ వెనకడుగు వేయరని, సత్యాన్ని కాపాడటంలో ఆమెకున్న నిబద్ధతకు ఇది నిదర్శనమని పేర్కొంది. ఆమె వంటి నాయకురాలు మరొకరు లేరు అని ఎక్స్ వేదికగా పార్టీ ప్రశంసలు కురిపించింది. మొత్తానికి, మమత నల్లకోటు ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి.