న్యూఢిల్లీ, మే 18 (ఇయ్యాల తెలంగాణ) : ప్రధాని నరేంద్ర మోదీ మరో అరుదైన అంతర్జాతీయ గౌరవాన్ని అందుకున్నారు. ప్రపంచ నాయకులకు స్వీడన్ అందించే అత్యున్నత పురస్కారం ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ ది పోలార్ స్టార్ కమాండర్ గ్రాండ్ క్రాస’ ఆయనకు లభించింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రధాని మోదీకి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.ప్రధాని మోదీ అద్భుతమైన నాయకత్వ పటిమకు ఈ పురస్కారం ఒక నిదర్శనమని చంద్రబాబు కొనియాడారు. అంతర్జాతీయంగా భారత భాగస్వామ్యాలను, ప్రపంచ దేశాలతో సహకారాన్ని బలోపేతం చేయడానికి మోదీ నిరంతరం చేస్తున్న కృషిని ఈ అవార్డు ప్రతిబింబిస్తోందని ఆయన పేర్కొన్నారు.విశేషమేమిటంటే, ఇది ప్రధాని నరేంద్ర మోదీ తన రాజకీయ ప్రస్థానంలో అందుకున్న 31వ అంతర్జాతీయ పురస్కారం అని చంద్రబాబు వెల్లడించారు. ప్రపంచ వేదికపై భారతదేశ ఖ్యాతిని పెంచడంలో ఆయన నాయకత్వం కీలక పాత్ర పోషిస్తోందని కొనియాడారు
- Homepage
- National News
- Modi కి స్వీడన్ అత్యున్నత పురస్కారం
Modi కి స్వీడన్ అత్యున్నత పురస్కారం
Leave a Comment