”దూరదర్శని”Movie హృదయాలకు హత్తు కుంటుంది : ప్రియదర్శి

సువిక్షిత్, గీతికా రతన్ జంటగా ఓ యదార్థ సంఘటన ఆధారంగా రూపొందుతోన్న ఫీల్‌గుడ్ లవ్ ఎంటర్‌టైనర్ ‘దూరదర్శని’. కలిపింది ఇద్దరిని ఉపశీర్షిక. కార్తికేయ కొమ్మి దర్శకత్వంలో వారాహ మÖవీ మేకర్స్ పతాకంపై జయ శంకర్ రెడ్డి.ఎం, పాటివిÖది సంతోష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం రేపు (మే 15)న ప్రేక్షకుల ముందుకు రానుంది. థియేట్రికల్‌గా మంచి ఎక్స్‌పీరియన్స్ ఇవ్వబోతున్న ఈ సినిమా ప్రీరిలీజ్ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి హీరో ప్రియదర్శి, రాజు వెడ్స్ రాంబాయ్ చిత్ర దర్శకుడు సాయి కంపాటి హాజరయ్యారు.

దర్శకులు సాయిలు కంపాటి మాట్లాడుతూ ‘’ టైటిల్ బాగుంది. 90వ దశకంలో పుట్టిన అందరికి కనెక్ట్ అవుతుంది. తప్పకుండా సినిమా అందరికి నచ్చుతుందని ఆశిస్తున్నాను అన్నారు’

ప్రియదర్శి మాట్లాడుతూ ‘’ ఇలాంటి కొత్త సినిమాను సపోర్ట్ చేయాలని ఉంది. ఈ సినిమా ట్రైలర్ చూడగానే నా చిన్నప్పటి రోజులు గుర్తొచ్చాయి. ఆ రోజుల్లో అందరికి ప్రపంచాన్ని పరిచయం చేసింది దూరదర్శని. నేను కూడా చిన్నప్ప్పుడు దూరదర్శనిలో సినిమాలు చూసి ఇన్‌స్పయిర్ అయ్యి నటుడిగా మారాను. ఈ దూరదర్శని సినిమా సవిÖప దర్శనిగా ప్రేక్షకులను థియేటర్‌కు తీసుకొచ్చి, సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ఇలాంటి చిన్న సినిమాకు ప్రేక్షకుల ఆదరణ ఎంతో ముఖ్యం’ అన్నారు.

జెమిని సురేష్ మాట్లాడుతూ ‘’  నాలోని నటుడిని చూసుకునే అవకాశం దూరదర్శని సినిమా ద్వారా కలిగింది. ఈ సినిమాలో నటించడం నాకెంతో సంతోషానిచ్చింది. ఇలాంటి అవకాశం చాలా అరుదుగా వస్తుంది. నా మనసును హత్తుకున్న ఈ సినిమాను ప్రేక్షకులు కూడా ప్రేమిస్తారు. ఈ సినిమాలో ప్రతి పాత్ర ఎంతో రియలిస్టిక్‌గా ఉంటుంది.కథలోని పాత్రలు ఆడియన్స్‌తో మాట్లాడుతున్నట్లుగా ఉంటాయి. తప్పకుండా ఈ సినిమా ప్రేక్షకుల మన్నన్నలు పొందుతుందనే నమ్మకం ఉంది’ అన్నారు.

చిత్ర దర్శకుడు కార్తీకేయ కొమ్మి మాట్లాడుతూ ‘’అందరికి చిన్న సినిమాలా కనిపిస్తున్న ఈ సినిమా విడుదల తరువాత ఆ ఫీల్ పోతుంది. హీరో, హీరోయిన్‌ల పర్‌ఫార్మెన్స్ ఈ చిత్రానికి హైలైట్‌గా ఉంటుంది. సినిమాలో ఉన్న ఎమోషన్ అందరి హృదయాలకు హత్తుకుంటుంది అన్నారు.

సువిక్షిత్ మాట్లాడుతూ ‘’ విÖ ఊరి సినిమా, విÖ ఇంటి సినిమా, ఎలాంటి వల్గారిటీ లేకుండా ఉండే క్లీన్ సినిమా. అందర్ని ఎమోషనకు గురిచేస్తూ హృదయాలను హత్తుకుంటుంది. విÖ సొంతూరిలో విహారించినట్లుగా అనిపిస్తుంది. నా సినిమాను బ్లెస్ చేయడానికి ఇంత మంది సపోర్ట్ చేయడం నాకెంతో ఎమోషనల్‌గా ఉంది. తప్పకుండా ఆడియన్స్ టిక్కెట్ డబ్బులకు న్యాయం చేస్తుంది’ అన్నారు. ఈ కార్యక్రమంలో నటుడు కిట్టయ్య, తేజ, బాలరాజు, చలపతిరాజు, గీతికారతన్, చిత్తూరు కుర్రాడు సునీల్, మురళీ మోహన్, నారాయణ దూరదర్శన్ న్యూస్ రీడర్ విజయలక్క్ష్మీ, హీరో సాయి మాగంటి తదితరులు పాల్గొన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....