హైదరాబాద్, ఆగస్టు 14 (ఇయ్యాల తెలంగాణ) : తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్ వ్యాన్ డ్రైవర్లు బంద్‌కు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ ఈ నెల 23 అర్ధరాత్రి (24) నుంచి బంద్ చేస్తున్నట్లు కార్మిక సంఘాల నేతలు తెలిపారు. తెలంగాణ ఆటో, యాప్ ఆధారిత ఆటో, క్యాబ్, వ్యాన్ డ్రైవర్ల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య కళానిలయంలో సమావేశం నిర్వహించారు. మొత్తం 17 కార్మిక సంఘాల నేతలు పాల్గొని వివిధ అంశాలపై చర్చించారు.. ఈ నెల 23 నుంచి బంద్‌కు పిలుపునిచ్చారు.తమకు ఇచ్చిన హావిÖలపై ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే ముఖ్యమంత్రి నివాసంతోపాటుగా అసెంబ్లీ, ప్రజాభవన్ ముట్టడిస్తామన్నారు కార్మిక సంఘాల నేతలు. హైదరాబాద్‌ను లక్షల ఆటోలతో దిగ్బంధం చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హావిÖ ప్రకారం ఆటో, రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. పెట్రోలు, డీజిల్, గ్యాస్, నిత్యావసర సరకుల ధరలు పెరిగాయని.. అందుకు తగిన విధంగా ఆటో విÖటరు ఛార్జీలనూ పెంచాలంటున్నారు.
తెలంగాణ ప్రభుత్వం ఓలా, ఉబర్, ర్యాపిడోలకు బదులుగా కొత్త యాప్‌ను తీసుకురావాలని డిమాండ్ చేశారు. అలాగే ఆటో డ్రైవర్లకు ఇస్తామన్న రూ.12 వేలు పథకం అమలు అంశాన్ని పరిశీలించాలని కోరారు.తెలంగాణ ప్రభుత్వం పెద్దల్ని ఆటో డ్రైవర్ల సమస్యలపై ఇప్పటికే పలుమార్లు కలిసి విజ్ఞప్తులు చేశామని కార్మిక సంఘాల నేతలు గుర్తు చేశారు. గతంలో తాము ఒకరోజు సమ్మెకు దిగితే తమ సమస్యలు పరిష్కరిస్తామని హావిÖలిచ్చినా ఇప్పటివరకు ఒక్కటి కూడా అమలు కాలేదన్నారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించే వరకు ఉద్యమం కొనసాగుతుందన్నారు. ఈ నెల 23 నుంచి ఆటో, క్యాబ్, స్కూల్ వ్యాన్ డ్రైవర్లు బంద్‌కు పిలుపునివ్వడం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో ఆర్టీసీ, కార్పొరేట్ సంస్థలకు ఈవీ ఆటోలు అందించే ప్రతిపాదననను వెంటనే నిలిపివేయాలని కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో దాదాపు 7.5 లక్షల మంది ఆటో డ్రైవర్లు ఉన్నారని.. హైదరాబాద్‌లో సుమారు 2.5 లక్షల మంది ఉన్నారన్నారు. తమ సమస్యలు పరిష్కరించేంత వరుకు ఉద్యమం కొనసాగతుందున్నారు. మరి తెలంగాణ ప్రభుత్వం ఈ బంద్ అంశంపై ఎలా స్పందిస్తుందో చూడాలి