కన్నడ చిత్ర పరిశ్రమలో ‘సుప్రీమ్ స్టార’ గా పేరు తెచ్చుకున్న భార్గవ్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న సినిమా “తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు”. ఈ చిత్రంలో విÖనాక్షి జైస్వాల్, ఆరియా విÖనన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు కన్నడ భాషల్లో కొసల క్రియేటివ్ వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై ప్రొడ్యూసర్ బండి నాగరాజు నిర్మిస్తున్నారు. మద్దినేని రమేష్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. భార్గవ్ బి. వి. దర్శకత్వం వహిస్తున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఎమోషనల్ థ్రిల్లర్ గా ఈ సినిమా రూపొందనుంది.
శుక్రవారం హైదరాబాద్ లో పూజా కార్యక్రమాలతో ఈ చిత్ర ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు క్లాప్ ఇవ్వగా, ఫిలింఛాంబర్ సెక్రటరీ కె. అశోక్ కుమార్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. దర్శకుడు దశరథ్ తొలి షాట్ కు గౌరవ దర్శకత్వం వహించారు. డైరెక్టర్ వీరశంకర్ స్కిప్ట్ అందజేశారు. అనంతరం జరిగిన ప్రెస్ విÖట్ లో
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మద్దినేని రమేష్ మాట్లాడుతూ ` ఈ రోజు మా మÖవీ పూజా కార్యక్రమాలకు అతిథులుగా వచ్చిన చదలవాడ శ్రీనివాసరావు గారికి, అశోక్ కుమార్ గారికి, దశరథ్ గారికి, ఇతర పెద్దలందరికీ కృతజ్ఞతలు. భార్గవ్ తెలుగు వారే. ఆయన కన్నడలో సుప్రీమ్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. మా మÖవీలో విÖనాక్షి జైస్వాల్, అరియా విÖనన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. హైదరాబాద్, బెంగళూరులో మా చిత్ర షూటింగ్ జరపబోతున్నాం. అక్టోబర్ కల్లా మÖవీ చిత్రీకరణ పూర్తి చేసి రిలీజ్ కు రెడీ చేస్తాం అన్నారు.
ప్రొడ్యూసర్ బండి నాగరాజు మాట్లాడుతూ ` ఒక మంచి కథతో మా సినిమాను నిర్మిస్తున్నాం. భార్గవ్ కన్నడలో ఎంతో కష్టపడి పేరు తెచ్చుకున్నారు. స్టార్ గా ఎదిగారు. ఆయన మా చిత్రంలో హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. మా మÖవీ షూటింగ్ సెప్టెంబర్ ఫస్ట్ వీక్ నుంచి బెంగళూరులోని ఒక విలేజ్ లో ప్రారంభిస్తాం. రెండు షెడ్యూల్స్ లో సినిమా చిత్రీకరణ పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నాం. మా సినిమాకు రోహిత్ నాలుగు మంచి సాంగ్స్ ఇచ్చారు. అలాగే టెక్నీషియన్స్, నటీనటులు అందరూ బాగా సపోర్ట్ చేస్తున్నారు అన్నారు.
కాదంబరి కిరణ్ మాట్లాడుతూ ` “తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు” సినిమాను దర్శక నిర్మాతలు చాలా మంచి కాన్సెప్ట్ తో రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ తండ్రి పాత్రలో నటిస్తున్నాను. బండి నాగరాజు, మద్దినేని రమేష్ వంటి మిత్రులు నటుడిగా నన్ను ప్రోత్సహిస్తున్నారు. ఈ సినిమాకు విÖరంతా సహకారం అందిస్తారని కోరుకుంటున్నా అన్నారు.
నటుడు కిల్లి క్రాంతి మాట్లాడుతూ ` శ్రావణ శుక్రవారం ప్రారంభమైన ఈ సినిమాకు అంతా మంచే జరిగాలని కోరుకుంటున్నా. ఈ సినిమాతో భార్గవ్ హీరోగానే కాదు దర్శకుడిగానూ తన ప్రతిభ చూపించబోతున్నారు. ప్రొడ్యూసర్ బండి నాగరాజు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మద్దినేని రమేష్ నా వెల్ విషర్స్. ఈ చిత్రంలో ఒక మంచి క్యారెక్టర్ లో విÖకు కనిపించబోతుండటం సంతోషంగా ఉంది అన్నారు.
మÖ్యజిక్ డైరెక్టర్ పెద్దపల్లి రోహిత్ మాట్లాడుతూ ` మంచి కథా కథనాలతో వస్తున్న చిత్రమిది. ఈ కంటెంట్ ఓరియెంటెడ్ మÖవీకి మÖ్యజిక్ చేసే అవకాశం రావడం హ్యాపీగా ఉంది. సాంగ్స్ బాగా కుదిరాయి. సినిమాతో పాటు పాటలకు మంచి పేరొస్తుందని నమ్ముతున్నాను అన్నారు.
నటుడు టేస్టీ తేజ మాట్లాడుతూ ` తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు పాట మనందరికీ ఎలా గుర్తుండిపోయిందో ఈ సినిమా కూడా అలాగే గుర్తిండిపోతుంది అన్నారు.
హీరోయిన్ ఆరియా విÖనన్ మాట్లాడుతూ ` ఈ చిత్రంలో బ్యూటిఫుల్ విలేజ్ అమ్మాయి క్యారెక్టర్ చేస్తున్నాను. నా క్యారెక్టర్ సరదగా బబ్లీగా ఉంటుంది. భార్గవ్ హీరోగా మంచి కథతో రూపొందుతున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించే అవకాశం రావడం హ్యాపీగా ఉంది అన్నారు.
డైలాగ్ రైటర్ త్యాగరాజు మాట్లాడుతూ ` తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు కదిలాయి మదిలోన ఎనెన్నో కథలు అని పాటలో రాసినట్లు వీళ్ల మదిలో ఎన్నెన్ని కథలు మెదిలాయి అనేది విÖరు మా సినిమాలో చూస్తారు. ఇదొక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. ఈ చిత్రానికి మాటలురాసే అవకాశం కల్పించిన మా ప్రొడ్యూసర్ గారికి, మద్దినేని రమేష్ గారికి థ్యాంక్స్ అన్నారు.
గీత రచయిత వెనిగళ్ల రాంబాబు మాట్లాడుతూ ` ఇలాంటి మంచి చిత్రానికి సాహిత్యాన్ని అందించే అవకాశం రావడం సంతోషంగా ఉంది. పెద్దపల్లి రోహిత్ విÖ అందరికీ నచ్చే ట్యూన్స్ రెడీ చేశారు. మంచి మనసున్న నిర్మాత నాగరాజు, మా మద్దినేని రమేష్ గారు ఈ సినిమాను మంచి క్వాలిటీతో విÖ ముందుకు తీసుకురాబోతున్నారు అన్నారు.
హీరోయిన్ విÖనాక్షి జైస్వాల్ మాట్లాడుతూ ` ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించే అవకాశం రావడం సంతోషంగా ఉంది. భార్గవ్ మంచి కోస్టార్. ఆయనతో సినిమా చేయడం గొప్ప అవకాశంగా భావిస్తున్నా. త్వరలోనే ఒక హిట్ మÖవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాం అనే నమ్మకం మా టీమ్ అందరిలో ఉంది అన్నారు.
హీరో, డైరెక్టర్ భార్గవ్ మాట్లాడుతూ ` తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు పాటలో ఎంత వైబ్ ఉందో మా సినిమాలోనూ అలాంటి ఫీల్ ఉంటుంది. ఈ చిత్రంతో తెలుగులో నా కెరీర్ స్టార్ట్ చేయడం హ్యాపీగా ఉంది. మంచి ప్రొడ్యూసర్ ఉంటేనే మంచి మÖవీ చేయగలం. మా నాగరాజు సినిమా పట్ల ప్యాషన్ ఉన్న ప్రొడ్యూసర్. అలాగే మద్దినేని రమేష్ గారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. సినిమా అంటే వందల మంది ఫ్యామిలీస్ ఆధారపడి ఉంటారు. అలాంటి సినిమాను ఎంతో కన్విక్షన్ తో చేస్తున్నాం. మా రోహిత్ గారు సూపర్ హిట్ సాంగ్స్ ఇచ్చారు. ఎడ్జ్ ఆఫ్ ది సీట్ సీన్స్ తో పాటు, సీట్స్ లో నుంచి ఎగిరి డ్యాన్సులు చేసే ఐటెం సాంగ్ మా మÖవీలో చూస్తారు అన్నారు.
నటీనటులు ` భార్గవ్, విÖనాక్షి జైస్వాల్, ఆరియా విÖనన్, కాదంబరి కిరణ్, కిల్లి క్రాంతి, అనంత ప్రభు, టేస్టీ తేజ, సాయి కిషోర్, నితిన్, తదితరులు