రంగారెడ్డి, ఏప్రిల్ 18 (ఇయ్యాల తెలంగాణ) : కోర్టు ఆదేశాలను ధిక్కరించిన అత్తాపూర్ ఆర్డీవోకు నెల రోజుల జైలు శిక్ష పడింది. రంగారెడ్డి జిల్లా పెద్ద షాపూర్లో సర్వే నంబర్ 172`183 లలో 74 ఎకరాల సీలింగ్ ల్యాండ్ భూ వివాదంలో కోర్టు ఉత్తర్వులు అమలు చేయలేదని యూసుఫుద్దీన్ హైకోర్టులో పిటిషన్ వేసారు. విచారణ జరిపి, సూచించిన సమయానికి ఉత్తర్వులు జారీ చేయలేదని అత్తాపూర్ ఆర్డీవోకు కోర్టు ధిక్కరణ కింద నెల రోజుల జైలు, రూ.2వేల జరిమానా హైకోర్టు విధించింది. జరిమానా చెల్లించకుంటే 2వారాలు శిక్ష పొడిగించాలని ఆదేశాలు జారీ చేసింది. అప్పిల్కు వీలుగా తీర్పు అమలును 2 వారాలు నిలిపివేసింది.
- Homepage
- General News
- అత్తాపూర్ RDO కు నెల రోజుల జైలు శిక్ష
అత్తాపూర్ RDO కు నెల రోజుల జైలు శిక్ష
Leave a Comment