అంబెడ్కర్ జయంతి వేడుకలు
నాంపల్లి , ఏప్రిల్ 15 (ఇయ్యాల తెలంగాణ) : డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాలు పురస్కరించుకొని అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో పటేల్ నగర్ లో అంబెడ్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు జగపతి మహేష్ కుమార్ అధ్యక్షతన జరిగిన బాబాసాహెబ్ జయంతి వేడుకల్లో పలువురు నాయకులు పాల్గొని అంబేడ్కర్ చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహం ధగర అన్నప్రసాద కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జగపతి శేఖర్ తో డి సి సి కార్యదర్శి ముండ్రాయి శ్రీనివాస్, బి ఆర్ ఎస్ నాయకులు మీసాల క్రాంతి యెల్లా వెంకటేష్, సేనాపతి వీరేష్ ఎల్ల శ్రీనివాస్ మల్లెపాగ వినోద్ కుమార్ శ్రీకాంత్ (కన్నా) బి ఆర్ ఎస్ నాయకులు పటేల్ నగర్ బస్తీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.