
హైదరాబాద్, సెప్టెంబర్ 30 (ఇయ్యాల తెలంగాణ) : అభినయ భారతం సొసైటీ ఆధ్వర్యంలో సనత్ నగర్లో బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. వెల్ఫేర్ మైదానంలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని సంప్రదాయ బద్దంగా రంగు రంగుల పూలతో బతుకమ్మలు పేర్చారు. ఈ సందర్భంగా ఉత్తమ బతుకమ్మను పేర్చిన వారికి సొసైటీ ఆధ్వర్యంలో బహుమతి ప్రదానం చేశారు. అభినయ భారతం సొసైటీ జాతీయ అధ్యక్షులు పి. సునీల్ కుమార్ సతీమణి వైష్ణవి చేతుల మీదుగా విజేతలకు బహుమతులు అందజేశారు. మొదటి బహుమతిని శ్రీదేవి రూ.10,000 నగదు రూపంలో అందుకోగా, రెండో బహుమతిని కావేరి రూ.7,500, మూడో బహుమతిని మంజుల రూ.5,000, నాలుగో బహుమతిని శ్రీలత రూ.3,500గా అందుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు వెన్నెల రామ్మోహన్, వైయస్సార్ స్టేట్ సెక్రెటరీ జీవన్ రాజ్, టీడీపీ నాయకులు శ్రీపతి సతీష్, సిలిండర్ సూర్యనారాయణ, బీజేపీ సనత్ నగర్ అధ్యక్షులు నరేష్, నాయకులు పోలిమేర సంతోష్ కుమార్, సత్యనారాయణ, మాధవి, స్వప్న గుప్తా తదితరులు పాల్గొన్నారు.
