
హైదరాబాద్, సెప్టెంబర్ 30 (ఇయ్యాల తెలంగాణ) : తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సీవీ ఆనంద్ బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ గా నిన్నటి వరకు కొనసాగిన సీవీ ఆనంద్ ను తెలంగాణ రాష్ట్ర హోం శాఖా ప్రత్యేక ప్రధాన కార్యాదర్శి గా నియమిస్తూ రేవంత్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆయన మంగళ వారం సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం అక్కడ ఉద్యోగులతో కలసి విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఉద్యోగులు సీవీ ఆనంద్ ను కలసి పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు.
