హైదరాబాద్, సెప్టెంబర్ 30 (ఇయ్యాల తెలంగాణ) : రాజేంద్ర నగర్ నూతన డీసీపీగా యోగేష్ గౌతమ్ బాధ్యతలు స్వీకరించారు. 2018 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన గౌతమ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల బదిలీ చేసిన ఐపీఎస్ అధికారుల్లో గౌతమ్ ను రాజేంద్ర నగర్ డీసీపీ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆయన సైబరాబాద్ కమీషనరేట్ పరిధిలోని రాజేంద్రనగర్ జోన్ డీసీపీ గా మంగళవారం బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్, మహబూబా బాద్ అదనపు ఎస్పీగా నార్త్ జోన్ అడిషనల్ డీసీపీగా సైబరాబాద్ లోని వివిధ హోదాల్లో పనిచేశారు. సైబరాబాద్ పరిధిలో నేరాల అదుపునకు పెట్రోలింగ్ ను మరింత పెంచడంతో పాటు శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తామని ఈ సందర్బంగా పేర్కొన్నారు. నేరాల అదుపునకు సైబరాబాద్ లో పకడ్బందీ ప్రణాళిక ఉంటుందని ఈ సందర్బంగా ఆయన హెచ్చరిక జారీ చేశారు.
