‘ది రెడ్ బ్యాగ్’ Movie లో సావిత్రి పాత్రలో రాశీ

మెమరీ మేకర్స్ బ్యానర్ విÖద డిఫరెంట్ కాన్సెప్ట్, కంటెంట్‌తో కొత్త నిర్మాత హరికృష్ణ సోమిశెట్టి ‘ది రెడ్ బ్యాగ’ అనే సినిమాని నిర్మిస్తున్నారు. బ్యాగ్ చుట్టూ తిరిగే ఈ మూవీకి రవి కుమార్ సీరపు కథ, కథనం, దర్శకత్వ బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నారు.ఈ చిత్రంలో కబీర్ సింగ్, ప్రసాద్ బెహరా, రాధ్య, మోనిక, స్నేహా సింగ్, ఆకాంక్ష, ఈషాన్ శంకర్, అవినాష్ బదల్, భార్గవి తదితరులు ముఖ్య పాత్రల్ని పోషించారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్లు సినిమాపై అంచనాల్ని పెంచేశాయి. తాజాగా ఈ సినిమా నుంచి స్పెషల్ రోల్ పోషిస్తున్న రాశీ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు.

సావిత్రి పాత్రలో రాశీ ‘ది రెడ్ బ్యాగ’ సినిమాలో ఓ పవర్ ఫుల్ రోల్‌ను పోషించారు. ఇక ఈ పాత్రకు సంబంధించిన గెటప్, లుక్స్ ఎంత సింపుల్‌గా ఉన్నాయో.. ఆమె లుక్ అంత ఇంటెన్స్‌గా ఉంది. ఈ చిత్రాన్ని మలుపు తిప్పే ఓ కీలక పాత్రలో రాశీ నటించారు.  ప్రస్తుతం ఈ చిత్రాన్ని త్వరలోనే రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. 

ఈ క్రమంలోనే టీజర్‌ను రెడీ చేస్తున్నట్టుగా టీం తెలిపింది. ఇక టీజర్‌తో మÖవీపై మరింత బజ్ క్రియేట్ కానుంది. తొలి సినిమానే అయినా, నిర్మాత  హరికృష్ణ సోమిశెట్టి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ బడ్జెట్‌తో చిత్రాన్ని నిర్మించారు. ఈ మÖవీకి శేఖర్ మోపురి సంగీతమందించగా.. ప్రియేష్ గురుసామి కెమెరామెన్‌గా, శివ శర్వాని ఎడిటర్‌గా పని చేశారు. 

నటీనటులు : కబీర్ సింగ్, ప్రసాద్ బెహరా, రాధ్య, మోనిక, స్నేహా సింగ్, ఆకాంక్ష, ఈషాన్ శంకర్, అవినాష్ బదల్, భార్గవి తదితరులు

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....