ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థలు పెన్ మÖవీస్, శ్రీ నీలాద్రి ప్రొడక్షన్స్.. ఆర్‌వీ స్టూడియోస్‌తో కలిసి ‘మహావీర్ కర్ణ’ అనే ఎపిక్ హైబ్రిడ్ లైవ్ యాక్షన్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాయి. భారతీయ సినిమాను సరికొత్త విజువల్ ప్రపంచంలోకి తీసుకెళ్లేలా ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో రూపొందిస్తున్నారు. ఈ చిత్రాన్ని జయంతీలాల్ గడా సమర్పిస్తున్నారు. బ్లాక్‌బస్టర్ చిత్రాల దర్శకుడు రమేష్ వర్మ ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌కు దర్శకత్వం వహిస్తున్నారు. కమర్షియల్‌గా సక్సెస్ అయిన ‘రాక్షసుడు’, ‘ఖిలాడీ’ వంటి డిఫరెంట్ జోనర్ మÖవీస్‌తో తనదైన గుర్తింపు తెచ్చుకున్న రమేష్ వర్మ.. ‘మహావీర్ కర్ణ’ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.యాక్షన్, థ్రిల్లర్, కమర్షియల్ సినిమాలతో తనదైన గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ రమేష్ వర్మ.. ఇప్పుడు సరికొత్త జోనర్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. మహాభారతంలోని చిరస్మరణీయమైన కర్ణుడి కథను ఆధారంగా చేసుకుని ‘మహావీర్ కర్ణ’ను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని రమేష్ వర్మ ఓ వినూత్నమైన హైబ్రిడ్ లైవ్ యాక్షన్ ఫార్మాట్‌లో రూపొందించనున్నారు. లైవ్ పెర్ఫార్మెన్స్‌లోని భావోద్వేగ బలాన్ని, అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్ అందించే అపారమైన అవకాశాలను కలిపి ఈ చిత్రాన్ని సరికొత్త అనుభూతిని అందించేలా రూపొందిస్తున్నారు.
ఈ ప్రయోగాన్ని మరింత ఆసక్తికరంగా మార్చే అంశం కర్ణుడి కథనే ఈ చిత్రానికి భావోద్వేగ కేంద్రంగా ఎంచుకోవడం. కర్ణుడి కథ కేవలం కీర్తి కోసం పోరాడిన ఓ యోధుడి కథ మాత్రమే కాదు.. అన్నింటికంటే ఎక్కువగా తన మాటకే విలువ ఇచ్చిన ఓ మహా వీరుడి కథ. కుంతీ దేవికి జన్మించినప్పటికీ రాజకుటుంబానికి దూరంగా పెరిగిన కర్ణుడు.. జీవితాంతం తిరస్కారం, విధివశాత్తు తన అసలు గుర్తింపును కోల్పోవటం వంటి ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాడు. అయినప్పటికీ.. తనను నమ్మిక వ్యక్తులు, సిద్ధాంతాల పట్ల మాత్రం ఎప్పుడూ దృఢమైన విధేయతను చూపించాడు.
ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండటం, తన అపారమైన దానగుణంతో వీరుడైన కర్ణుడు తనలోని ఓ ప్రత్యేకమైన వ్యక్తిత్వాన్ని చాటుకున్నాడు. తాను ఇచ్చిన మాటను తప్పడం కంటే.. ఆ మాట వల్ల ఎదురయ్యే పరిణామాలను ఎదుర్కోవడానికే కర్ణుడు సిద్ధపడ్డాడు. మాట నిలబెట్టుకునే విషయంలో కర్ణుడి నిబద్ధత ఎప్పుడూ రాజీపడనిది. అందుకే మహాభారతంలోని అత్యంత ఆసక్తికరమైన, విషాదభరితమైన పాత్రల్లో కర్ణుడు ఒకరిగా నిలిచాడు. కర్ణుడి వ్యక్తిత్వంలోని ఈ బలమైన కోణమే ‘మహావీర్ కర్ణ’ చిత్రానికి ప్రధాన భావోద్వేగ పునాదిగా నిలుస్తోంది.
లేటెస్ట్‌గా ‘మహావీర్ కర్ణ’కు సంబంధించిన టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. టీజర్‌లోనే కర్ణుడి ఈ ప్రత్యేకమైన వ్యక్తిత్వాన్ని బలంగా చూపించారు. యోధులు, రాజ్యాలు, ఆయుధాలు, అద్భుతమైన విజువల్స్ వంటి భారీ అంశాలు ఆకట్టుకున్నప్పటికీ.. ప్రేక్షకుల మనసులో నిలిచేది మాత్రం తాను ఇచ్చిన మాటకు కట్టుబడి నిలబడే కర్ణుడి వ్యక్తిత్వమే. విజువల్ ట్రీట్‌మెంట్‌ను చూస్తుంటే.. మేకర్స్ కర్ణుడిని కేవలం ఓ పౌరాణిక కథగా కాకుండా, గౌరవం, నమ్మకం, స్నేహం, ద్రోహం, విధి, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి చెల్లించాల్సిన మÖల్యం వంటి అంశాలతో కూడిన ఓ అద్భుతమైన మానవీయ గాథగా చూపిస్తున్నట్లు తెలుస్తోంది.
హైబ్రిడ్ లైవ్ యాక్షన్ విధానం ఈ ఆలోచనకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. భారతీయ సినిమాలో అరుదుగా కనిపించే స్థాయిలో స్కేల్, విజువల్స్, సినిమాటిక్ వరల్డ్ బిల్డింగ్‌పై ప్రయోగాలు చేసే అవకాశాన్ని ఈ ఫార్మేట్ దర్శకుడు రమేష్ వర్మకు అందిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన క్రియేటివ్ అండ్ టెక్నికల్ టీమ్‌లో హైబ్రిడ్ క్రియేటర్ రామ్‌జీ దత్ డీఓపీగా, ప్రవీణ్ పూడి ఎడిటర్‌గా, గీత రచయిత శ్రీమణి డైలాగ్ రైటర్‌గా, గ్యాని సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నారు.
దర్శకుడు రమేష్ వర్మ కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రయోగంగా తెరకెక్కుతున్న ‘మహావీర్ కర్ణ’.. భారతీయ ఇతిహాసాల్లోని గొప్ప పాత్రల్లో ఒకటైన కర్ణుడి కథను నేటి తరానికి సరికొత్త అద్భుతమైన సినిమాటిక్ అనుభూతిగా అందించేందుకు సిద్ధమవుతోంది. భారీ స్కేల్‌లో రూపొందుతున్న ఈ చిత్రం డిసెంబర్ 4, 2026న గ్రాండ్ పాన్ ఇండియా మÖవీగా రిలీజ్‌కు సిద్ధమవుతోంది.