DMK పార్టీకి ఊహించని షాక్ ఇచ్చిన ఓటర్లు

తమిళనాడు, మే 04 (ఇయ్యాల తెలంగాణ) : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కనీవినీ ఎరుగని ఫలితాలు వచ్చాయి.. దశాబ్దాల రాజకీయ చరిత్ర కలిగిన డీఎంకే పార్టీకి ఓటర్లు ఊహించని షాక్ ఇచ్చారు. తాజా ట్రెండ్స్ ప్రకారం, అధికార పార్టీ  అగ్రనేతలందరూ తమ సొంత నియోజకవర్గాల్లో పరాజయం పాలయ్యారు.  ఎవరూ ఊహించని విధంగా ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ తన సొంత నియోజకవర్గం కొలత్తూరులో వెనుకంజలో పడ్డారు.  ప్రారంభ  రౌండ్ల నుంచే ఆయనకు వ్యతిరేక ఫలితాలు రావడం రాజకీయ వర్గాలను విస్మయానికి గురిచేసింది. కేవలం ముఖ్యమంత్రి మాత్రమే కాకుండా, రాష్ట్ర కేబినెట్లోని 28 మంది మంత్రులు వెనుకంజలో  కొనసాగారు.  ఇప్పటికే డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ చెపాక్ లో వెనుకబడగా, ఇప్పుడు మంత్రులందరూ అదే బాటలో ఉండటంతో డీఎంకే పతనం ఖాయం అయింది.  రాజకీయ అరంగేట్రం  చేసిన తొలిసారే నటుడు విజయ్  ప్రభంజనం సృష్టించారు. టీవీకే పార్టీ ఏకంగా  సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. ఏఐడీఎంకే  రెండో స్థానంలో ఉండగా, అధికార డీఎంకే కేవలం  మÖడో స్థానానికి  పడిపోయింది.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....