SC / ST ఉపవర్గీకరణ తక్షణమే అమలు దిశగా ప్రయత్నాలు`: CM రేవంత్‌ రెడ్డి

సుప్రీంకోర్టు తీర్పుపై అసెంబ్లీలో రేవంత్‌ రెడ్డి కీలక ప్రకటన

హైదరాబాద్‌, ఆగస్టు 1 (ఇయ్యాల తెలంగాణ) : ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి ఆహ్వానించారు. దీనిపై సభలో కీలక ప్రకటన చేశారు.  దేశంలో ఈ తీర్పును అమలు చేసే తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తుందని ప్రకటించారు రేవంత్‌ రెడ్డి. వీలైతే ఆర్డినెన్స్‌ తీసుకొచ్చైనా తీర్పును అమలు చేసి మాదిగలకు న్యాయం చేస్తామని హావిూ ఇచ్చారు రేవంత్‌ రెడ్డి. ఈ అంశంపైనే రోజంతా సభలో చర్చిద్దామని సూచన చేశారు. అనంత ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణపై చర్చ ప్రారంభించారు. రేవంత్‌ రెడ్డి తన స్టేట్‌మెంట్‌లో ఏమన్నారంటే… ‘‘ఇవాళ కీలకమైన ప్రకటన చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. కొన్ని దశాబ్ధాల నుంచి లక్షల మంది మాదిగ యువకులు ఎస్సీ రిజర్వేషన్లలో ఏబీసీడీ వర్గీకరణ కోసం పోరాడుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కానీ, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కానీ 27 ఏళ్ల నుంచి ఏబీసీడీ వర్గీకరణ కోసం ఉద్యమాలు చేస్తున్నారు. 

ఒకప్పుడు ఇదే శాసనసభలో ఎస్సీ ఉపకులాల వర్గీకరణ కోసం వాయిదా తీర్మానం ఇస్తే నాతోపాటు ఆ నాటి ఎమ్మెల్యే సంపత్‌ను సభ నుంచి బహిష్కరించారు. ఏబీసీడీ వర్గీకరణపై కేంద్రానికి లెటర్‌ రాయడానికి అఖిల పక్షాన్ని తీసుకెళ్తామని గత ప్రభుత్వం చెప్పి మాదిగలను మోసం చేసింది. కానీ కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత దామోదర్‌ నేతృత్వంలో ఎమ్మెల్యేలను న్యాయవాదులను ఢల్లీికి పంపించి సుప్రీంకోర్టులో బలమైన వాదనలు తెలంగాణ రాష్ట్రం తరుఫున వినిపించాం. తెలంగాణ ప్రభుత్వ న్యాయపోరాట ఫలితంగా సుప్రీంకోర్టు మాదిగ ఉపకులాల వర్గీకరణకు అంగీకారం తెలిపింది. దానిని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. తీర్పు ఇచ్చిన బెంచ్‌కు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఏడుగురిలో ఆరుగురు రాష్ట్రాలకు ఏబీసీడీ వర్గీకరణ చేయడానికి అనుమతి ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున స్పష్టమైన ప్రకటన చేస్తున్నాను. అందరి కంటే ముందు నిలబడి ఏబీసీడీ వర్గీకరణ అమలు చేసే బాధ్యత తీసుకుంటాం. అవసరమైతే ఇప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్లలో కూడా వర్గీకరణ అమలు చేయడానికి అవసరమైతే ఆర్డినెన్స్‌ తీసుకొస్తాం. మాదిగ సోదరులకు న్యాయం చేస్తాం. ఇవాళ సభ అందరూ ఈ అంశంపై ఏకాభిప్రాయానికి వచ్చి మాదిగల ఉపకులాల వర్గీకరణకు సహకరించాలని కోరుతున్నాను.  

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....