‘రాజా ది రాజా’ Movie నుంచి ఊహలే Song రిలీజ్

యూత్‌ఫుల్ ప్రమోషనల్ కంటెంట్‌తో ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచిన ‘రాజా ది రాజా’ చిత్రం మూవీ లవర్స్‌లో మంచి బజ్‌ను క్రియేట్ చేస్తోంది. రుత్విక్, విశాఖ ధీమన్ జంటగా నటిస్తున్న ఈ యూత్  ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌కు అనిల్ బోయిడపు దర్శకత్వం వహిస్తున్నారు. వృందావన్ క్రియేషన్స్ బ్యానర్‌పై కె. నిహారికా దాసరి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, కె. శ్రీలతా రెడ్డి సమర్పిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన టీజర్, ఫస్ట్ సింగిల్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.ఈ రోజు మేకర్స్ సెకండ్ సింగిల్ ఊహలే రిలీజ్ చేశారు. మార్క్ కె రాబిన్ ఈ సాంగ్ ని బ్యూటీఫుల్ లవ్ సాంగ్ గా కంపోజ్ చేశారు.

 కృష్ణకాంత్ (కేకే) రాసిన హృదయాన్ని తాకే సాహిత్యం మరింత అందాన్ని తీసుకొచ్చింది.కార్తీక్, శ్వేతా మోహన్ తమ ప్లజెంట్ వోకల్స్ తో పాటలోని ప్రేమ భావాలను ఎంతో ఆహ్లాదకరంగా ఆవిష్కరించారు.

ఈ సాంగ్ లో విజువల్స్ చాలా లావిష్ గా వున్నాయి. రుత్విక్, విశాఖ ధిమాన్ కెమిస్టీ బ్యూటీఫుల్ ఆకట్టుకుంది.    ఈ చిత్రానికి రవికిరణ్ బోయిడపు సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, విజయ్ కుమార్ పసుపులేటి ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.ఈ చిత్రంలో సాయికుమార్, డాక్టర్ నరేష్ విజయకృష్ణ, అవసరాల శ్రీనివాస్, విష్ణు ఓయి, పార్వతీశం, రాజశ్రీ నాయర్, రోహిణి, బద్రం, మైమ్ మధు, ఆనంద్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.‘రాజా ది రాజా’ యÖత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకునే రిఫ్రెషింగ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులని అలరించనుంది.

మైత్రీ మÖవీ డిస్టిబ్యూటర్స్  ద్వారా ‘రాజా ది రాజా’ జూలై 17న విడుదల కానుంది.

తారాగణం: రుత్విక్, విశాఖ ధీమాన్, సాయి కుమార్, డా. నరేష్ విజయ కృష్ణ, అవసరాల శ్రీనివాస్, విష్ణు ఓయి, పార్వతీశం, రాజశ్రీ నాయర్, రోహిణి, బద్రం, మైమ్ మధు, ఆనంద్

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....