వరుసగా 13వ సారి జెండా ఎగరేసిన PM మోడీ

న్యూఢిల్లీ, ఆగస్టు 15 (ఇయ్యాల తెలంగాణ) : భారతదేశ 80వ స్వాతంత్య్ర వేడుకల్లో ఎర్రకోట బురుజుల నుంచి వరుసగా 13వ సారి జాతినుద్దేశించి ప్రసంగించి, అత్యధికసార్లు ప్రసంగించిన కాంగ్రెసేతర ప్రధానిగా ఒక కొత్త రికార్డును నెలకొల్పారు.2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ప్రతి ఏటా ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తున్న సంప్రదాయాన్ని మోదీ కొనసాగిస్తున్నారు. కార్యక్రమం ఖరారైన షెడ్యూల్ ప్రకారం, ప్రధాని మోదీ ఎర్రకోటకు చేరుకున్న వెంటనే త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తారు. అనంతరం సైన్యం 21 తుపాకులతో గౌరవ వందనం సమర్పించింది. హెలికాప్టర్ ద్వారా పూల వర్షం కురిపించడం ఈ వేడుకల్లో భాగంగా ఉంటుంది. ఆ తర్వాత ప్రధాని మోదీ దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు దేశ ప్రగతి, సాధించిన విజయాలు, భవిష్యత్ దార్శనికతను తన ప్రసంగంలో వివరించారు.స్వాతంత్య్ర వేడుకలకు ఒక ప్రత్యేకత ఉంది. జాతీయ గేయం ‘వందేమాతరం’కు 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వేడుకల్లో దీనికి ప్రముఖ స్థానం కల్పించారు. స్వాతంత్య్ర వేడుకల చరిత్రలో తొలిసారిగా ఎర్రకోటపై ‘వందేమాతరం’ సామÖహిక గానం జరగనుంది. ఎన్‌సీసీ క్యాడెట్లు, ‘మై భారత’ వాలంటీర్లు కలిసి ఈ గేయాన్ని ఆలపించారు.2047 నాటికి ‘వికసిత భారత’ నిర్మాణంలో యువత శక్తి, ఆకాంక్షలు, భాగస్వామ్యాన్ని ప్రతిబింబిస్తూ ‘యువశక్తి’కి కూడా ఈసారి వేడుకల్లో ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నారు. చారిత్రక వారసత్వానికి, భవిష్యత్ లక్ష్యాలకు వారధిగా ఈ ఏడాది 80వ స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహించారు

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....