e KYC కోసం August 31లోపు డెడ్ లైన్

హైదరాబాద్, ఆగస్టు 12, (ఇయ్యాల తెలంగాణ) : దేశవ్యాప్తంగా ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులు ఆగస్టు 31లోగా ఈ కేవైసీ (ఎలక్టానిక్ నో యువర్ కస్టమర్) ప్రక్రియను పూర్తి చేయాలని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు సూచిస్తున్నాయి. ఈ గడువులోగా పూర్తి చేయని వినియోగదారులకు భవిష్యత్తులో గ్యాస్ సేవలకు సంబంధించిన ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా సబ్సిడీ, వినియోగదారుల వివరాల ధృవీకరణ, డూప్లికేట్ కనెక్షన్ల నివారణ వంటి అంశాల కోసం ఈ ప్రక్రియను చేపడుతున్నారు. దేశవ్యాప్తంగా ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులు ఆగస్టు 31లోగా ఈ కేవైసీ (ఎలక్టానిక్ నో యువర్ కస్టమర్) ప్రక్రియను పూర్తి చేయాలని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు సూచిస్తున్నాయి. ఈ గడువులోగా పూర్తి చేయని వినియోగదారులకు భవిష్యత్తులో గ్యాస్ సేవలకు సంబంధించిన ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా సబ్సిడీ, వినియోగదారుల వివరాల ధృవీకరణ, డూప్లికేట్ కనెక్షన్ల నివారణ వంటి అంశాల కోసం ఈ ప్రక్రియను చేపడుతున్నారు.

అయితే ఈ కేవైసీ కోసం ప్రత్యేకంగా కేంద్రాలకు వెళ్లకుండా ఇంట్లోనే మొబైల్ ద్వారా కూడా పూర్తి చేయొచ్చు. గ్యాస్ కనెక్షన్లు నిజమైన లబ్ధిదారుల పేర్లలోనే కొనసాగుతున్నాయా..? లేదా అనే విషయాన్ని నిర్ధారించడం కోసమే ఈ ఈ కేవైసీ. ఒకే వ్యక్తి పేరుతో ఒకటి కంటే ఎక్కువ కనెక్షన్లు ఉండటం.. తప్పుడు వివరాలతో కనెక్షన్లు తీసుకోవడం వంటి అక్రమాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఈ ధ్రువీకరణను చేపడుతున్నాయి. దీంతో అర్హులైన వినియోగదారులకే ప్రభుత్వ ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటున్నారు.ఈ కేవైసీ పూర్తి చేయడానికి గ్యాస్ ఏజెన్సీకి వెళ్లాలంటే కొందరికి ఇబ్బందులు ఉంటాయి. దీంతో ఆ అవసరం లేకుండా ఇంటి నుంచే స్మార్ట్‌ఫోన్ ద్వారా దీనిని పూర్తి చేసుకునే అవకాశం కల్పించారు.

ఇందుకోసం విÖరు ఏ కంపెనీ గ్యాస్ కనెక్షన్ ఉపయోగిస్తున్నారో దానికి అనుగుణంగా యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. లేదా ఆ కంపెనీ వెబ్ సైట్ నుంచి కూడా ఈ ప్రక్రియను చేయొచ్చు.ముందుగా గ్యాస్ కంపెనీ యాప్ డౌన్ లోడ్ చేసుకున్న తరువాత రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌తో లాగిన్ అవ్వాలి. అనంతరం ప్రొఫైల్ లేదా మై అకౌంట్ విభాగంలోకి వెళ్లి ‘ఈకేవైసీ లేదా రీ వెరిఫికేషన్ అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అక్కడ ఆధార్ ఆధారిత ముఖ గుర్తింపు కోసం ఆధార్ ఫేస్ ఆర్ డీ యాప్ ఓపెన్ అవుతుంది. ముఖంపై సరిపడా వెలుతురు ఉండేలా చూసుకుని కెమెరా ద్వారా ఫేస్ స్కాన్ పూర్తి చేయాలి. ధ్రువీకరణ విజయవంతమైతే ఈ కేవైసీ పూర్తయినట్లు స్కీన్‌పై సమాచారం కనిపించడంతో పాటు కన్ఫర్మేషన్ మెసేజ్ కూడా వస్తుంది ఫేస్ స్కాన్ చేసే సమయంలో ముఖం స్పష్టంగా కనిపించేలా ఉండాలి. కళ్లద్దాలు, మాస్క్, టోపీ వంటివి తొలగించడం మంచిది. ఇంటర్నెట్ కనెక్షన్ బాగా ఉండాలి. అలాగే ఆధార్‌లో నమోదైన వ్యక్తే స్కాన్ చేయాలి. లేదంటే ధృవీకరణ విఫలమయ్యే అవకాశం ఉంటుంది. చాలా మంది ఒకేసారి ఈ కేవైసీ చేయడానికి ప్రయత్నిస్తే సర్వర్‌పై ఒత్తిడి పెరిగి యాప్ నెమ్మదిగా పనిచేసే అవకాశం ఉంటుంది. అందుకే ఉదయం తొందరగా లేదా రాత్రి సమయంలో ఈ కేవైసీ ప్రయత్నిస్తే ప్రక్రియ త్వరగా పూర్తయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వినియోగదారులు చెబుతున్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....