ప్రముఖ పాన్`ఇండియా నిర్మాణ సంస్థ ‘మైత్రీ మూవీ మేకర్స’ కేవలం తెలుగు పరిశ్రమకే పరిమితం కాకుండా ఇతర భాషల్లోనూ భారీ చిత్రాలను నిర్మిస్తోంది. ఈ క్రమంలో వారి నాలుగవ తమిళ చిత్రాన్ని ప్రకటించారు. ధృవ్ విక్రమ్ హీరోగా నటిస్తున్న నాలుగవ చిత్రం కావడం విశేషం. పూర్తి స్థాయి కమర్షియల్ ఎంటర్టైనర్గా రూపొందనున్న ఈ చిత్రానికి కరణ్ అరవింద్ కుమార్ దర్శకత్వం వహించనున్నారు.
చెన్నైలోని ఓఖీఅ నగర్ మైత్రీ ఆఫీస్ లో జరిగిన పూజా కార్యక్రమంతో #ఓyబిష్ట్రతీతిTజీఎతిశ్రీ04 #ఆV4 ప్రాజెక్ట్ అధికారికంగా ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి చిత్ర బృందం, పలువురు ప్రముఖ అతిథులు హాజరయ్యారు.ధృవ్ విక్రమ్, దర్శకుడు కరణ్ అరవింద్ కుమార్, చిత్ర బృందంతో కలిసి ఈ శుభకార్యంలో పాల్గొన్నారు.
ముహూర్తం షాట్ కు దర్శకుడు కీర్తిశ్వరన్ క్లాప్‌బోర్డ్ కొట్టారు. దర్శకులు అధిక్ రవిచంద్రన్, రవికుమార్, కీర్తిశ్వరన్, ఆంటోనీ భాగ్యరాజ్, రాజా, శశి, ‘హాయ్ నాన్న’ ఫేమ్ శౌర్యువ్ ఈ ప్రారంభోత్సవ వేడుకకు హాజరయ్యారు.
నవీన్ యెర్నేని, వై. రవి శంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రం (ఆV4), ధృవ్ విక్రమ్‌ను పూర్తిగా మాస్`ఓరియెంటెడ్ అవతార్‌లో కనిపించనున్నారు. నటనకు ప్రాధాన్యతనిచ్చే పాత్రలతో ప్రయోగాలు చేయడానికి పేరుపొందిన ధృవ్ , ఇప్పుడు మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందుతున్న ఒక కమర్షియల్ ఎంటర్టైనర్ కోసం సిద్ధమయ్యారు.
కరణ్ అరవింద్ కుమార్, సబీతో కలిసి ఈ చిత్రానికి స్కీన్ప్లేను కూడా అందించారు. ఈ చిత్రానికి అద్భుతమైన సాంకేతిక బృందం పని చేస్తోంది. సినిమాటోగ్రఫీని వికీ నిర్వహించనుండగా, జయసూర్య ఎడిటర్. కాస్ట్యూమ్ డిజైనర్ ప్రవీణ్ రాజా, ప్రొడక్షన్ డిజైనర్ జి.ఎం. శేఖర్, యాక్షన్ కొరియోగ్రాఫర్ విక్రమ్ మోర్.
త్వరలో ఇతర వివరాలు తెలియజేయనున్నారు
