యాదాద్రి జులై 26,(ఇయ్యాల తెలంగాణ ):భువనగిరి ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విూద ఆగ్రహాం వ్యక్తం చేస్తున్న ఓ ఆడియో సోషల్ విూడియాలో వైరల్ అవుతోంది. . భువనగిరి సెగ్మెంట్ లోని పచర్లగూడ తండా ఉప సర్పంచ్ గుగులోతు తిరుపతి, ఎంపి కోమటిరెడ్డి విూద ఆగ్రహాం వ్యక్తం చేశారు. సొంత తమ్ముడు రాజగోపాల్ రెడ్డి పార్టీ మారుతుంటే ఆపలేని అసమర్ధుడుగా ఉన్న నువ్వు.. కష్టపడి పార్టీని కార్యకర్తలకు ఎడారిని కాపాడుకుంటున్నా కుంభం అనిల్ కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా నాలుగు గ్రూపులను తయారు చేసి రాజకీయాలు చేయడం సబబేనా అని ప్రశ్నించారు. నల్లగొండ సిగ్నెంట్లో నిన్ను పట్టించుకునే దిక్కు లేదని.. వచ్చి బోనగిరిలో పోటీ చేస్తే మేమంతా చందాలు వేసుకొని గెలిపించామని ఉప సర్పంచ్ గుర్తు చేశారు. గెలిచే అవకాశం ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్లలో గ్రూపు రాజకీయాలు చేయడంపై సదరు నాయకుడు ఎంపీ విూద మండిపడ్డారు. ఈ ఆడియో సోషల్ విూడియాలో వైరల్ గా మారింది.