రాధాకృష్ణుల వేషధారణలో అలరించిన చిన్నారులు
తుగ్గలి, సెప్టెంబర్ 04 (ఇయ్యాల తెలంగాణ) : శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని తుగ్గలిలో ఇంటింటా భక్తి పారవశ్యం వెల్లివిరిసింది.చిన్నారులు చిన్ని రాధాకృష్ణుల అవతారంలో ముస్తాబై ఇంటిలోనే అందరినీ అలరించారు.బాలురు పంచె కట్టుతో నెమలి పింఛం కిరీటం,చేతిలో పిల్లనగ్రోవితో చిన్ని కృష్ణుడిలా, బాలికలు రంగురంగుల పట్టు పరికిణీలు,మెరిసే ఆభరణాలతో రాధాదేవి లాగా సాక్షాత్కరించారు. చిన్ని రాధాకృష్ణులు ఇల్లంతా బుడిబుడి అడుగులతో తిరుగుతూ పండుగ వాతావరణం నెలకొల్పారు.పిల్లల ఈ ముద్దుల అలంకరణను చూసి కుటుంబ సభ్యులు, బంధువులు ఆనందంతో మురిసిపోయారు. మన సంస్కృతి, సంప్రదాయాలను,భక్తి భావాన్ని చిన్నారులలో చిన్ననాటి నుండే పెంపొందించేందుకు ఇలాంటి వేడుకలు ఎంతో దోహదపడతాయని తల్లిదండ్రులు తెలిపారు.
