అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్
హైదరాబాద్, ఏప్రిల్ 13 (ఇయ్యాల తెలంగాణ) : గత ఐదేళ్లలో గరిష్ట స్థాయిలో ఇంటర్లో ఉత్తీర్ణత నమోదు కావడం ఇదే తొలిసారి. ఇక ఇంటర్ పరీక్షలు తప్పిన విద్యార్థులకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌ను కూడా ఇంటర్‌బోర్డు కార్యదర్శి కృష్ణఆదిత్య ఆదివారం సాయంత్రం విడుదల చేశారు. ఈ పరీక్షలను మే 13 నుంచి 21వ తేదీ వరకు జరగనున్నాయి. ప్రధాన సబ్జెక్టులు మే 19వ తేదీతోనే ముగుస్తాయి. ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, సెకండ్ ఇయర్ పరీక్షలు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరుగుతాయి.ఇక ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు మే 22 నుంచి 25వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఇంగ్లిష్ సబ్జెక్ట్ ప్రాక్టికల్ పరీక్షలను మే 26న నిర్వహిస్తారు. సాధారణంగా సప్లిమెంటరీ పరీక్షలకు సబ్జెక్టులు తప్పిన వారితోపాటు మెరుగైనా మార్కులు పొందేందుకు కూడా సబ్జెక్టులను మళ్లీ రాస్తుంటారు. వీరికి రెండోసారి జరిగిన పరీక్షలో ఒక వేళ మార్కులు తగ్గితే పాత మార్కులే కొనసాగిస్తారు. దీంతో విద్యార్ధులు మెరుగైన మార్కుల కోసం కూడా అధిక సంఖ్యలో పరీక్ష రాసేందుకు ముందుకొస్తున్నారు. ఈ పరీక్షలు రాసే విద్యార్ధులకు విడిగా మళ్లీ హాల్ టికెట్లను జారీ చేస్తారు.
తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ 2026 టైం టేబుల్ ఇదే

👉 మే 13న సెకండ్ లాంగ్వేజ్
👉 మే 14న ఇంగ్లిష్
👉 మే 15న మ్యాథ్స్ ఏ, బోటనీ , పొలిటికల్ సైన్స్
👉 మే 16న మ్యాథ్స్ 2ఏ, జువాలజీ, హిస్టరీ
👉 మే 18న ఫిజిక్స్, ఎకనామిక్స్
👉 మే 19న కెమిస్టీ, కామర్స్
👉 మే 20న పబ్లిక్ అడ్మినిస్టేషన్ , బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్
👉 మే 21న మోడ్రన్ లాంగ్వేజ్, జాగ్రఫీ
