ఫాంటసీ థ్రిల్లర్ గా “కెరూబ్ ” Movie

విహాన్ కార్తీక్, దివ్య విశ్వకర్మ హీరో హీరోయిన్స్ గా నటిస్తున్న సినిమా “కెరూబ”. ఈ చిత్రాన్ని ఖుషి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై ప్రొడ్యూసర్ బాలు బల్లెకారి నిర్మిస్తున్నారు. ఫాంటసీ థ్రిల్లర్ కథతో దర్శకుడు ఎం జె  నాయుడు (జీవన్) రూపొందిస్తున్నారు. ఫస్ట్ కాపీ రెడీ చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. సెప్టెంబర్ లో “కెరూబ” చిత్రాన్ని గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొచ్చేందుకు దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

ఇప్పటికే “కెరూబ” సినిమా నుంచి రిలీజ్ చేసిన టీజర్ హ్యూజ్ రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. తాజాగా రిలీజ్ చేసిన “కెరూబ” సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ వైవిధ్యంగా కనిపిస్తోంది. ఈ పోస్టర్ లో జలపాతంతో కూడిన ఆహ్లాదకరమైన ప్రకృతిలో హీరో వేణువు వాయిస్తున్న స్టిల్ తో ఫస్ట్ లుక్ పోస్టర్ చూడగానే ఆకట్టుకుంటోంది. ఒక సరికొత్త ఫాంటసీ థ్రిల్లర్ కథను “కెరూబ” చిత్రంలో చూడబోతున్నామనే ఫీల్ ప్రేక్షకుల్లో కలుగుతోంది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మేకర్స్ త్వరలో వెల్లడించనున్నారు.

నటీనటులు ` విహాన్ కార్తీక్, దివ్య విశ్వకర్మ, కల్పలత, సుమన్ శెట్టి, రమేష్ కొనంభొట్ల, గడ్డం సురేష్, శ్రీధర్ మాడ, తదితరులు

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....