స్థంభించిన రాకపోకలు
తిరుపతి, మే 18 (ఇయ్యాల తెలంగాణ) : భాకరాపేట కనుమ రహదారిలో ఏనుగుల గుంపు సంచారంతో సుమారు గంటపాటుగా రాకపోకలు స్తంభించిపోయాయి. ఏనుగుల గుంపు సంచారం పై చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని స్పందించారు. అటవీ శాఖ ఉన్నతాధికారులను అప్రమత్తం చేసి రాత్రిపూట ప్రయాణికులకు, వాహన చోదకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కొద్దిరోజుల పాటు గస్తీ నిర్వహించాలని అటవీశాఖ అధికారులు ఆదేశించారు.
సుమారు గంటపాటు కనుమ రహదారిలో స్తంభించిన రాకపోకలు… అందులో రెండు అంబులెన్సులు ఉండడంతో ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా గమ్యస్థానాలకు చేర్చాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. ఆటవీ అధికారులు, పోలీసులు ఏనుగులను రహదారిపై నుండి దట్టమైన అటవీ ప్రాంతంలోకి తరిమేసి రాకపోకలను క్రమబద్ధీకరించారు.