CBSE పదో తరగతి పరీక్షల ఫలితాలు

Xth Class Exam Results CBSE

https://results.cbse.nic.in

న్యూఢిల్లీ, ఏప్రిల్ 13 (ఇయ్యాల తెలంగాణ) : దేశ వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్సీ) పదో తరగతి పరీక్షల ఫలితాలు మంగళవారం విడుదలయ్యే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ఈరోజు సాయంత్రంలోపు వెలువడనుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 17 నుంచి మార్చి 11 వరకు సీబీఎస్సీ పదో తరగతి పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు దేశవ్యాప్తంగా సుమారు 25 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరంతా ఫలితాల కోసం నిరీక్షిస్తున్నారు. ఫలితాలు విడుదలైన తర్వాత విద్యార్థులు అధికారిక సీబీఎస్సీ వెబ్‌సైట్‌లలో ష్ట్రబిబిజూబ://లిలిలి.ఞbబవ.ణనీల.తిని/ లేదా https://cbse.results.nic.inలేదా ఞbబవ.నితిఞ.తిని మాత్రమే చెక్ చేసుకోవల్సి ఉంటుంది. వీటితోపాటు తో పాటు డిజిలాకర్ (ఆతిణతిఒనీఞkవతీ), ఉమాంగ్ (ఙఓంఔఉ) యాప్‌ల ద్వారా కూడా తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. విద్యార్ధులు తమ రోల్ నంబర్, స్కూల్ నంబర్, అడ్మిట్ కార్డ్ ఐడీ, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి ఫలితాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. గత ఏడాది10వ, 12వ తరగతి ఫలితాలు రెండూ ఒకేసారి మే 13న ప్రకటించారు.

కాగా సీబీఎస్సీ పదో తరగతిలో ఈ ఏడాది నుంచి రెండో విడతలుగా బోర్డు పరీక్షలను నిర్వహిస్తుంది. ఈ విధానంలో విద్యార్థులు గరిష్టంగా మూడు సబ్జెక్టులలో తమ స్కోర్లను మెరుగుపరుచుకోవడానికి మళ్లీ పరీక్షలు రాసే అవకాశం కల్పిస్తారు. సెషన్ 1 ఫలితాల్లో తమ మార్కులను మెరుగుపరుచుకోవాలనుకునే విద్యార్థుల కోసం బోర్డు సెషన్ 2 పరీక్షలను నిర్వహించనుంది. ఈ ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలు మే 15 నుంచి ప్రారంభమవుతాయి. అలాగే పదో తరగతిలో ఒకటి లేదా రెండు మార్కులు తక్కువ వచ్చిన విద్యార్థులకు గ్రేస్ మార్కులు కూడా ఇవ్వనున్నారు. పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి అభ్యర్థులు మొత్తం విÖద కనీసం 33 శాతం మార్కులు పొందాల్సి ఉంటుంది.ఇక సీబీఎస్సీ 12వ తరగతి ఫలితాలు మే నెల రెండో వారంలో విడుదలయ్యే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 10వ తరగతి పరీక్షలు మార్చి 11న ముగియగా, 12వ తరగతి పరీక్షలు 2026 ఏప్రిల్ 10న ముగిశాయి. పదో తరగతి, 12వ తరగతికి కలిపి ఈ ఏడాది దాదాపు 43 లక్షల మంది విద్యార్ధులు పరీక్షలు రాశారు. వీరంతా ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.


iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....