హైదరాబాద్, జూన్ 15 (ఇయ్యాల తెలంగాణ) :హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ హెచ్ ఫాస్ట్ పోలీసులు ఆకస్మిక దాడులు జరిపారు. మార్కెట్లో కల్తీ పనీర్ తయారు చేస్తున్న యÖనిట్ పై దాడులు జరిపారు. టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్ రఘునాధ్ మాట్లాడుతూ ఇప్పటికే వ్యాపారస్తులకు యÖనిట్ నిర్వహకులకు హెచ్చరిక జారీ చేసాం. చీజ్ అనలాగ్ను పనీర్గా విక్రయిస్తున్నట్లు గుర్తించావ. ఇది వినియోగదారులను మోసం చేసే చర్య. ధిక డబ్బుకు ఆశపడి కల్తీ పన్నీరు మార్కెట్లో చాలామంది చేస్తున్నారు వ్యాపారాలు. చీజ్ అనలాగ్లో పాలేతర కొవ్వులు, కూరగాయల కొవ్వులు మిక్స్ చేసి తయారు చేస్తున్నారు. “మలై పనీర”, “మిల్క్ పనీర” పేర్లతో కూడా అమ్ముతున్నారు. కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ నుండి సరఫరా జరుగుతోంది. “లో ఫ్యాట్ పనీర” వంటి తప్పుదారి పట్టించే లేబుళ్లు ఉపయోగిస్తున్నారు. కొన్ని ఉత్పత్తులపై తయారీ వివరాలు లేవు. బ్యాచ్ నంబర్లు లేకుండా విక్రయిస్తున్నట్లు తెలిసింది గడువు తేదీలు లేకుండా కూడా అమ్మకాలు జరుగుతున్నాయి. పనీర్ ఆర్డర్ చేస్తే చీజ్ అనలాగ్ సరఫరా చేస్తున్న కేసులు ఉన్నాయని అన్నారు.

తయారీదారులు ఉత్పత్తిని “చీజ్ అనలాగ”గా ప్రకటిస్తున్నారు. రిటైల్ స్థాయిలో మాత్రం పనీర్గా విక్రయిస్తున్నారు. అధిక లాభాల కోసం తప్పుడు బ్రాండింగ్ చేస్తున్నారు. కొన్ని తయారీదారులకు చెల్లుబాటు అయ్యే ఈSSంఎ లైసెన్స్ లేదు. కొన్ని దుకాణాలు లైసెన్స్ లేకుండానే వ్యాపారం చేస్తున్నాయి. చీజ్ అనలాగ్ను “ప్రీమియం పనీర” పేరుతో రీప్యాక్ చేస్తున్నారు. ఉత్పత్తుల ట్రేసబిలిటీ లేకపోవడం గుర్తించారు. పిండిపదార్థాలు కలిపిన కల్తీ పనీర్ సైతం వెలుగులోకి వచ్చాయి. అధిక నీరు కలిపి నాణ్యతను తగ్గిస్తున్నారు. పాలేతర కొవ్వులు ఉపయోగిస్తున్నట్లు తనిఖీల్లో తేలింది. నాణ్యతలేని కృత్రిమ పాలు ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. అపరిశుభ్రమైన నిల్వ పద్ధతులు బయటపడ్డాయి. దాడుల్లో 45 అవుట్లెట్లు, 8 తయారీ యÖనిట్లు తనిఖీ చేశామన్నారు.
సుమారు 825 కిలోల కల్తీ తప్పుడు బ్రాండింగ్ ఉత్పత్తులు స్వాధీనం చేసుకున్నామని అన్నారు.
లైసెన్స్ ఉన్న విక్రేతల నుంచే పనీర్ కొనాలి, లేబుల్ మరియు గడువు తేదీ తప్పనిసరిగా తనిఖీ చేయాలి, లేబుల్ లేని ఉత్పత్తులను నివారించాలని అన్నారు.
