బెంగాల్ CM గా సువేందు అధికారి !

కోల్ కత్తా, మే 04 (ఇయ్యాల తెలంగాణ) :  పశ్చిమ బెంగాల్ రాజకీయ చరిత్రలో ఒక కీలక మలుపు చోటు చేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ దూసుకెళ్తోంది. ఈ స్టోరీ రాసే సరికి ఉన్న ట్రెండ్ చూస్తే బీజేపీ అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసేంత మ్యాజిక్ ఫిగర్ సాధించే సీట్లలో ఆధిక్యంలో ఉంది. రాష్ట్ర అధికార కేంద్రమైన నబన్న వైపు కాషాయ దళం వేగంగా అడుగులు వేస్తోంది. ఈ ఎన్నికల ఫలితాల్లో అత్యంత ఆసక్తికరమైన అంశం ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన సొంత నియోజకవర్గంలో ఆయాసంతో పరుగులు పెడుతున్నారు. స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతోంది. దీంతో ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణం చేస్తారనే చర్చ మొదలైంది. మమతతో విభేదించి బీజేపీలో చేరినప్పటి నుంచి విజయం వరకు బీజేపీని నడిపించిన సువేదు అధికారి తర్వతా సీఎం కుర్చిలో కూర్చుంటారనే చర్చ సాగుతోంది. ప్రస్తుతం ట్రెండ్స్ ప్రకారం భవానీపూర్‌లో మమతా బెనర్జీ స్వల్ప ఆధిక్యంలో ఉన్నారు. ఓట్ల లెక్కింపు మొదలైన తర్వాత ఆమె వెనుకబడ్డారు. అక్కడి ఫలితం రౌండ్ రౌండ్‌కి మారుతోంది. గతంలో 2021 అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్ వేదికా మమతా బెనర్జీని ఓడించిన సువేందు అధికారి, ఇప్పుడు మరోసారి ఆమెను ఓడించేంత పని చేస్తున్నారు. ఏ రౌండ్‌లో ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ అక్కడ నెలకొంది. మమత బెనర్జీ కంచు కోటలోనే సువేందు సవాల్ చేయడం టీఎంసీ శ్రేణులు కంగుతిన్నారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం, తాను భవానీపూర్‌లో 20వేల మెజార్టీ సాధిస్తానని, రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ 180కిపైగా సీట్లు సాధిస్తుందని సువేందు చెప్పుకొచ్చారు. భవానీపూర్‌లో ఆ పరిస్థితి లేకపోయినా ఓవరాల్ సీట్ల విషయంలో మాత్రం ఆయన లెక్క తప్పలేదని తెలుస్తోంది. మమతకు ఒకప్పుడు అత్యంత సన్నిహితుడిగా పేరున్న వ్యక్తి సువేందు అధికారి. ప్రస్తుతం ఆమెను ప్రధాన రాజకీయ ప్రత్యర్థిగా మారారు. ఆయన రాజకీయ ప్రస్థానం గమనిస్తే… 2009లో లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2016`2020 పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంలో రవాణా, పర్యావరణ శాఖ మంత్రిగా పని చేశారు. 2020`2021 జూట్ కార్పొరేన్ ఆఫ్ ఇండియా ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు.

2021 తృమÖల్ కాంగ్రెస్ వీడి బీజేపీలో చేరారు. అదే ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్‌లో మమతాబెనర్జీని ఓడించి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు.ప్రస్తుతం ప్రతిపక్ష నేతగా ఉన్న ఆయన త్వరలోనే సీఎం కుర్చీలో కూర్చోనున్నారు. సువేందు అధికారి ఒక అభ్యర్థఇగానే కాకుండా, బెంగాల్ వ్యాప్తంగా బీజేపీ ప్రచార పగ్గాలను సమర్థవంతంగా నిర్వహించారు. ఈ ఎన్నికల్లో ఆయన చూపిన ప్రతిభ పార్టీలో ఆయన స్థానాన్ని, సీఎం కుర్చీ వేపు ఆయన ప్రయాణాన్ని మరింత దగ్గర చేసింది. పశ్చిమ బెంగాల్‌లో అధికారాన్ని చేజిక్కుంచుకోవాలని బీజేపీ చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తోంది. మమతా బెనర్జీ శైలిలోనే వీధుల్లో పోరాడుతూ, ప్రజల్లోకి వెళ్లడం ద్వారా సువేందు అధికారి బీజేపీకి కొత్త ఊపిరి పోశారు. బెంగాల్ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో బీజేపీకి వచ్చిన ఆధిక్యం చూస్తుంటే, ప్రజలు మార్పును కోరుకుంటున్నట్టు స్పష్టమవుతోంది. ఒక వేళ ఇదే ట్రెండ్ కొనసాగి బీజేపీ విజయం సాధిస్తే, అది మమతా బెనర్జీ రాజకీయ ప్రస్థానానికి పెద్ద విఘాతంగా మారుతుంది. ముఖ్యమంత్రి సువేందు అధికారి అని చాలా మంది భావిస్తున్నప్పటికీ బీజేపీ నాయకత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నప్పటికీ, ప్రస్తుతం పరిస్థితుల్లో సువేందు పేరు ముందంజలో ఉందన్నారు.

రేసులో మరో ఎంపీ

మాజీ రాజ్యసభ ఎంపీ, ప్రముఖ నటి రూపా గంగూలీ కూడా సీఎం రేసులో ఉన్నట్టు తెలుస్తోంది. సోనార్‌పూర్ దక్షిణ నియోజకవర్గం నుంచి ఆమె పోటీ చేస్తున్నారు. ముఖ్యంగా పట్టణ ఓటర్లలో ఆమెకు విపరీతమైన ఆదరణ ఉంది. దశాబ్ద కాలంగా బీజేపీలో ఉంటూ, పార్టీ మహిళా విభాగంలో కీలక పాత్ర పోషించిన ఆమెకు పాలనాపరమైన అనుభవం కూడా తోడవుతుందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. సువేందు అధికారి కూడా సీఎం రేసులో ఉన్నారు. మమతకు కుడి భుజంగా ఉంటూ వచ్చిన ఆయన గత ఎన్నికల ముందు టీఎంసీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. అప్పటి నుంచి మమతి నిజమైన ప్రత్యర్థిగా మారారు. ఆమె వైఖరిని ఎండగడుతూ బీజేపీని రూట్ లెవల్‌కు తీసుకెళ్లడంతో విజయవంతం అయ్యారు. నేటి విజయంలో ఆయన పాత్ర చాలా కీలకంగా ఉంది. అందుకే ఆయన పేరును కూడా సీఎం సీటు కోసం బీజేపీ అధిష్ఠానం పరిశీలిస్తోంది. ఏప్రిల్ నెలలో రెండు దశల్లో జరిగిన పోలింగ్‌కు సంబంధించిన లెక్కింపు ఇప్పుడు జరుగుతోంది. ఇందులో బీజేపీ మెజార్టీ స్థానాల్లో దూసుకెళ్తోంది.

దశాబ్దాలుగా అధికారంలో ఉన్న టీఎంసీ ప్రభుత్వంపై ప్రజల్లో పేరుకుపోయిన అసంతృప్తి బీజేపీకి వరంగా మారింది. కేంద్ర నాయకత్వ నుంచి క్షేత్రస్థాయి కార్యకర్తల వరకు బీజేపీ పక్కా ప్రణాళికతో ప్రచారం నిర్వహించడం కలిసి వచ్చింది. బెంగాల్ ప్రజలు ఒక కొతత్ మార్పును, సుస్థిర పాలనను ఆశించడం ఈ తీర్పునకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు. బెంగాల్‌లో బీజేపీ మతపరమైన సవిÖకరణాలతోపాటు అభివృద్ధి మంత్రాన్ని కూడా బలంగా తీసుకెళ్తింది. ఉద్యోగ అవకాశాలు, శాంతి భద్రతల అంశాలపై ప్రజలను ఆకర్షించడంలో ఆ పార్టీ సఫలమైంది. టీఎంసీ అంతర్గత కుమ్ములాటలు కూడా ఆ పార్టీ విజయావకాశాలను దెబ్బ తీశాయి. పశ్చిమ బెంగాల్ దశాబ్దాల తరబడి వామపక్షాల కోటగా ఉండేది. 2011లో మమతా బెనర్జీ  కోటను బద్దలు కొట్టి అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు. అప్పటి నుంచి టీఎంసీ బలంగా ఎదిగింది. అయితే 2019లో లోక్ సభ ఎన్నికల నుంచి బీజేపీ రాష్ట్రంలో క్రమంగా పుంజుకోవడం ప్రారంభించింది. 2021లో విఫలమైనప్పటికీ, 2026లో మాత్రం బీజేపీ గురి తప్పలేదు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....