హైదరాబాద్, జూలై 26 (ఇయ్యాల తెలంగాణ): జిహెచ్ఎంసి గోల్కొండ సర్కిల్ పరిధిలోని గోల్కొండ వార్డు కార్యాలయం ఆధ్వర్యంలో గోల్కొండలోని శ్రీ జగదాంబిక మహంకాళి అమ్మవారికి బోనం సమర్పణ కార్యక్రమం నిర్వహించారు. కన్నుల పండుగగా బోనాల సమర్పణ కొనసాగింది. గోల్కొండ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ జగన్ మార్గదర్శకత్వంలో శ్రీ జగదాంబిక మహంకాళి అమ్మవారికి బోనం సమర్పణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గోల్కొండ వార్డు కార్యాలయం తరఫున జోగిని భవాని నెత్తిన బోనం ఎత్తుకొని నృత్యాలు చేస్తూ బోనం సమర్పించారు. దారి పొడవునా పోతరాజులతో కలిసి భక్తిశ్రద్ధలతో బోనం సమర్పణ అమ్మవారికి బోనాలు సమర్పించడం జరిగింది.
ఈ వేడుకలో పెద్ద సంఖ్యలో భక్తులు, వివిధ సర్కిల్ కార్యాలయాలకు చెందిన ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నేతలు అధిక సంఖ్యలో పాల్గొని బోనాల పండుగను జయప్రదం చేశారు. గోల్కొండ శ్రీ జగదాంబిక మహంకాళి అమ్మవారి ఆశీస్సులు పొంది అందరూ సుఖ శాంతులతో ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, సుఖశాంతులు, సంతోషాలను ప్రసాదించాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడు కున్నట్లు పేర్కొన్నారు.
