విశాఖలో విషం చిమ్మిన ఎల్జి పాలిమర్స్
గ్యాస్ పీల్చడంతో వందలాది మందికి అస్వస్థత
నోరులేని పశువులకూ తప్పని మృత్యుఘోష
అస్వస్థులకు పలు ఆస్పత్రుల్లో చికిత్సలు
ప్రజలను తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలింపు
రంగంలోకి దిగిన జిల్లా అధికార యంత్రాంగం
మంత్రి అవంతి, కలెక్టర్,ఎస్పీ పర్యవేక్షణ
ఘటనపై అధికారులతో మాట్లాడిన సిఎం వైఎస్ జగన్
విశాఖపట్నం,మే7(ఇయ్యాల తెలంగాణ ): విశాఖ జిల్లాలో విషవాయువు ప్రాణాలు తీసింది. కొందరి ప్రాణాలను హరించగా..మరికొందరిని మృత్యువేదికపై నిలబెట్టింది. ఊపిరాడక మరికొందరు తల్లడిల్లుతున్నారు. తెల్లవారక ముందే వేకువ జామున జరిగిన ఘటన కావడంతో ప్రజలు తొసుకునే లోపే జరగాల్సిన నష్టం జరగిపోయింది. మనుషులతో పాటు, పశువులు కూడా విూత్యువాత పడ్డారు. విశాఖలోని గోపాలపట్నం పరిధిలోని ఆర్ఆర్ వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలో భారీ ప్రమాదం చోటుచేసుకోవడంతో గ్యాస్ లీకయ్యింది. గ్యాస్ పీల్చిన ఘటనలో ఇప్పటి వరకు ఏడుగురు మృతి చెందారు. దాదాపు 200 మంది అస్వస్థతకు గురయ్యారు. అపస్మారకంలోకి వెళ్లిన వారిని కేజీహెచ్‌లో చికిత్స అందిస్తున్నారు. మృతి చెందిన వారిలో ఇద్దరు వృద్దు, ఎనిమిదేళ్ల చిన్నారి కూడా ఉన్నారు. మరోవైపు విషవాయువు ప్రభావంతో వెంకటాపురంలో బావిలో పడి గంగరాజు అనే వ్యక్తి మృతిచెందగా, మేడపై నుంచి పడి మరోకరు ప్రాణాలు కోల్పోయారు. గురువారం త్లెవారు జామున గంట సమయంలో పరిశ్రమ నుంచి మెవడిన రసాయన వాయువు దాదాపు 3 కిలోవిూటర్ల మేర వ్యాపించింది. కాగా లీకైన రసాయన గాలి ప్చీడంతో అక్కడి స్థానిక ప్రజు ఊపిరి తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డారు. దీంతో పాటు చర్మంపై దద్దుర్లు, కళ్లలో మంటు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందు తలెత్తడంతో స్థానిక ప్రజు ఆందోళన వ్యక్తం చేస్తూ నాయుడు తోట పరిసరాల్లో ఇు్ల ఖాళీ చేసి మేఘాద్రి గడ్డ డ్యామ్ వైపు పరుగు తీశారు. కాగా రసాయన గాలి ప్చీడంతో కొంతమంది అస్వస్థతకు గురై అపస్మారకస్థితిలో రహదారిపైనే పడిపోయారు. కరోనా నేపథ్యంలో ఇప్పటివరకు లాక్డౌన్లో ఉన్న ఈ కంపెనీని తెరిపించే క్రమంలో త్లెవారుజామున 4 గంటకు ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కాగా పరిశ్రమ నుంచి స్టెరైన్ అనే విష వాయువు లీకైనట్లు తొస్తుంది. గ్యాస్ లీకేజీ ఘటనపై అధికార యంత్రాంగం తక్షణమే స్పందించి సైరన్ మోగించి ప్రజను అప్రమత్తం చేశారు. దీంతో పాటు గ్యాస్ లీకేజీపై పోలీసుకు సమాచారమందించారు. సమాచారం అందుకున్న పోలీసు ఘటనా స్థలికి చేరుకొని భయంతో తుపు వేసుకొని ఉండిపోయిన ప్రజను ఇళ్లను ఖాళీ చేయాల్సిందిగా హెచ్చరించి వేరే చోటికి తరలించారు. ఈ ప్రమాదంలో తీవ్ర అస్వస్థతకు గురైన 15 మందిని ఆంబులెన్స్‌లో విశాఖ కేజీహెచ్ ఆసుపత్రికి తరలించగా, మరికొందరిని వేర్వేరు ఆసుపత్రికి తరలించారు. అస్వస్థతకు గురైన వారిలో ఎక్కువగా చిన్నాయి, మహిళు ఉన్నారు. మంత్రి అవంతి శ్రీనివాస్, స్థానిక ఎమ్మెల్యే అదీప్‌రాజ్‌తో పాటు జిల్లా కలెక్టర్ వినయ్‌చంద్, విశాఖ నగర పోలీస్ కమిషనర్ ఆర్.కె.విూనా ఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యను పర్యవేక్షించారు.
కాగా ఎల్జి పాలిమర్స్‌లో రసాయన గ్యాస్ లీకైన ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కలెక్టర్ వినయ్‌చంద్‌కు ఫోన్ చేసి వివరాు తొసుకున్నారు. తక్షణమే సహాయ కార్యక్రమాు చేపట్టాని సీఎం ఆదేశించారు. రసాయన వాయువు విడుదలైన బాధిత ప్రాంతాల్లో తగిన చర్యు తీసుకోవాని జిల్లా కలెక్టర్‌కు ఆదేశాు జారీ చేశారు. విశాఖ జిల్లా కలెక్టర్ వినయ్‌చంద్ మాట్లాడుతూ.. ఎల్జీ పరిశ్రమలో స్టెరైన్ అనే రసాయన వాయువు లీకైందన్నారు. ఈ రసాయన వాయువు పీల్చి పువురు అస్వస్థతకు గురవ్వగా వారిని హుటాహుటిన కేజిహెచ్ సహా ఇతర ఆస్పత్రుకు తరలించామన్నారు. వైద్య సేవందించేందుకు తగిన ఏర్పాట్లు చేశామన్నారు. మరో 48 గంటపాటు పరిసర ప్రాంతా ప్రజు అప్రమత్తంగా ఉండాన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశా మేరకు పరిస్థితి ఎప్పటికప్పుడు సవిూక్షిస్తున్నట్లు పేర్కొన్నారు.కాగా ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని మంత్రి అవంతి శ్రీనివాస్ పరిశీలించారు. ఈ సందర్భంగా అవంతి మాట్లాడుతూ.. త్లెవారుజామున 3.30 గంట ప్రాంతంలో ప్రమాదం జరిగిందన్నారు. అధికాయి అప్రమత్తమై వెంటనే సహాయకచర్యు చేపట్టారు.. బాధితుకు అవసరమైన వైద్యసేమ అందిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు వాయువు ప్చీడంతో తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరిన బాధితుకు చికిత్స అందిస్తున్నట్లు కేజీహెచ్ సూపరింటెండెంట్ పేర్కొన్నారు. బాధితుకు చికిత్స అందించేందుకు ఆసుపత్రిలో డాక్టర్లు, సిబ్బంది అధిక సంఖ్యలోనే ఉన్నారన్నారు. కాగా త్లెవారుజామున గ్యాస్ లీకేజీ కావడంతో ఎక్కువమంది అస్వస్థతకు గురయ్యారు. వాయువు లీకైన ప్రదేశాల నుంచి ప్రజలు దూరంగా వెళితే బాగుంటుదని సూపరింటెండెంట్ వ్లెడిరచారు.`