విమానాశ్రయంలో బంగారం పట్టివేత
రంగారెడ్డి,జులై 25 (ఇయ్యాల తెలంగాణ) : రంగారెడ్డిజిల్లా శంషాబాద్ విమానాశ్రయంలో సీఐఎస్ఎఫ్, కస్టమ్స్ అధికారులే తనిఖీలు నిర్వహించారు. కస్టమ్స్ అధికారుల కళ్లు గప్పి తప్పించుకుని విమానాశ్రయం నుంచి బయటకు వచ్చిన స్మగ్లర్లను అధికారులు అదుపులోకి తీసుకన్నారు. ఎయిర్ పోర్ట్ లోని పార్కింగ్ స్థలంలో అనుమానం తో ఇద్దరు వ్యక్తులను సీఐఎస్ఎఫ్ భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకొని విచారించారు. ఇద్దరు ప్రయాణికుల లగేజీ బ్యాగులు తనిఖీ చేస్తే 45 లక్షల విలువ చేసే 700 గ్రాముల బంగారం గుట్టురట్టు అయింది. ఇద్దరు ప్రయాణికులు షేక్ చందు భాషా, ఫేక్ ఆరిఫ్ భాషాలను ను అదుపులోకి తీసుకొని కస్టమ్స్ అధికారులకు అప్పగించారు. నిందితులు కువైట్ నుండి ఇండిగో విమానంలో హైదరాబాద్ కు బంగారాన్ని తీసుకొచ్చినట్లుగా గుర్తించారు.