సనత్ నగర్, జూన్ 25 (ఇయ్యాల తెలంగాణ) :
భారతదేశ స్వాతంత్య్రనంతరం దళితులు, ఆదివాసీలకు కూడా రాజ్యాంగబద్ధమైన పదవులు దక్కాలనే జాతిపిత మహాత్మా గాంధీ ప్రగాఢ వాంఛ, ఎన్డీఏ మిత్ర పక్షాల ఉమ్మడి అభ్యర్థి ఝార్ఖండ్ మాజీ గవర్నర్ ఒడిశాకు చెందిన ఆదివాసీ నాయకురాలు ద్రౌపది ముర్ము దేశ 15 వ రాష్ట్రపతిగా ఎన్నికయ్యే అవకాశాలు అధికంగా ఉండడంతో ఎట్టకేలకు సాకారం కానుంది. ఒక దళిత లేదా గిరిజన మహిళకు భారత రాష్ట్రపతిగా అవకాశం కల్పించాలనే సంకల్పం ప్రధాన మంత్ర్తి నరేంద్ర మోడీ మస్తిష్కంలో మెదలడం ఆయనకు దళితులు మరియు అణగారిన వర్గాల పట్ల గల సానుకూల దృక్పథానికి అద్దం పడుతుంది.
భారత మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజపేయి బీజేపీ ముస్లిం వ్యతిరేక పార్టీ అనే అపోహలను తొలగించేలా భారత మిస్సైల్ పితామహుడు డా అబ్దుల్ కలాం ను భారత అత్యున్నత పదవికి ప్రతిపాదించడం, 2014 లో అధికారం చేపట్టిన తరువాత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, ఉన్నత విద్యావంతుడు, సమర్థవంతుడు అయిన రాంనాథ్ కోవింద్ ను దివంగత కె ఆర్ నారాయణన్ తరువాత రెండవ దళిత రాష్ట్రపతి గా ప్రతిపాదించడం, ఇప్పుడు ఝార్ఖండ్ మాజీ గవర్నర్ మరియు గిరిజన మహిళా నాయకురాలు ద్రౌపది ముర్మును ఎన్ డీ ఏ మిత్ర పక్షాల అభ్యర్థిగా బరిలోకి దింపడం బీజేపీకి ఆయా వర్గాల అభ్యున్నతి పట్ల గల చిత్తశుద్ధిని తెలియచేస్తుంది.
ఈ విషయాన్ని ఇదివరకే ఈ నెల 6 వ తేదీన మా అభిప్రాయంగా వేలిబుచ్చాము. దీక్షాదక్షత కలిగి భారత అత్యన్నత పదవికి వన్నె తేగల మహిళా అభ్యర్థిగా ఎన్ డీ ఏ మిత్ర పక్షాల అభ్యర్థిగా బరిలోకి దిగిన ద్రౌపది ముర్ము ప్రధాన మంత్రి అంచనాలను నిలబెడతారని తెలంగాణ బీజేపీ సనత్ నగర్ పరివార్ సభ్యులు బీజేపీ గిరిజన మోర్చా మాజీ ప్రధాన కార్యదర్శి చరణ్ సింగ్, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యేచన్ సురేష్, తాళ్ల జైహింద్ గౌడ్, సీనియర్ నాయకులు ఉత్తమ కుమార్ రాజ్ పురోహిత్, పొలిమేర సంతోష్ కుమార్, వై శ్రీనివాస్ రావు, సుధాకర్ ముదిరాజ్, ప్రవీణ్ గౌడ్, దశరథ్ గౌడ్, పి లక్ష్మణ్, బి వి పురుషోత్తం గౌడ్, ఆయిల శ్రీనివాస్, మల్లిఖార్జున్ గౌడ్, సి వి శ్రీనివాస్, రమేష్, అమరం శ్యాం, తేజో విజయ్ తదితరులు అభిప్రాయపడ్డారు.