పెద్దపల్లి జులై 10,(ఇయ్యాల తెలంగాణ ): నియోజకవర్గంలోని ప్రజల సమస్యలు స్వయంగా తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేయాలని ఏర్పాటు చేసిన కార్యక్రమం బ్రేక్ ఫాస్ట్ విత్ జీఎస్ ఆర్ లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గొట్టె ముక్కుల సురేష్ రెడ్డి పాల్గొన్నారు. సోమవారం మండలంలోని దేవునిపల్లి గ్రామంలో గ్రామ ప్రజలతో కలిసి అల్పాహారం చేస్తూ వారి సమస్యలు, బాధలు అడిగి తెలుసుకుని వారి సమస్యల పరిష్కారానికి బీజేపీ పార్టీ కృషి చేస్తుందని తెలిపారు. ప్రతిరోజు నియోజకవర్గ పరిధిలో రోజు ఒక్కో గ్రామంలో గ్రామ ప్రజలతో మమేకమై వారి సమస్యలు అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తానని సురేష్ రెడ్డి హావిూ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, ఉపసర్పంచ్ నరేష్, వార్డు సభ్యులు రావిశెట్టి కుమార్, రావిశెట్టి శ్రీనివాస్, ముడుసు నరేష్, దేవేందర్ రాచకొండ, అనిల్, కుమ్మరి శ్రవణ్, ఉదయ్ కిరణ్, బొడ్డుపల్లి విజయ్ తదితరులు పాల్గొన్నారు.