పేద ప్రజలెవరూ పస్తులు ఉండకుండా చూసుకోండి !
ఎమ్మెల్యేలకు అక్బరుద్దీన్ ఆహార కిట్ల అందజేత
హైదరాబాద్ మే 19 ఇయ్యాల తెలంగాణ
ఆల్ ఇండియా మజ్లీస్ ఏ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏ ఐ ఎం ఐ ఎం ) పార్టీ ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఒవైసి ఈ రోజు యాకుత్ పుర, బహదూర్ పుర నియోజక వర్గాలకు సంబంధించి సుమారు 5000 రేషన్ కిట్లను ఆయా నియోజక వర్గానికి సంబందించిన ఎమ్మెల్యేలకు అందజేశారు. నియోజక వర్గం పరిధిలోని పేద కుటుంబాలందరికి నిత్యావసర సరుకులు అందేలా చూడాలని ఎమ్మెల్యేలకు సూచించారు. లాక్ డౌన్ మూలంగా ఏంతో మంది పేద ప్రజలు కూడు దొరకక ఇబ్బందులకు గురవుతున్నారని ఎమ్మెల్యేలు తమ నియోజక వర్గం పరిధిలో పేద ప్రజలు పస్తులు పాడుకోకుండా చూడాల్సిన బాధ్యత శాసన సభ్యులపై ఉన్నదని తెలిపారు. ఎమ్మెల్యేలతో పాటు స్థానిక కార్పొరేటర్లు ఎం ఐ ఎం కార్యకర్తలు దగ్గరుండి ప్రతి పేద కుటుంబానికి నిత్యావసర కిట్లు సరఫరా అయ్యేలా చూసుకోవాలని సూచనలు చేశారు. ఈ రోజు దారుసలాం లోని పార్టీ కార్యాలయం లో అక్బరుద్దీన్ నిత్యావసర కిట్లను ఎమ్మెల్యేలకు అందజేశారు. ఇందులో బహదూర్ పుర ఎమ్మెల్యే మొహమ్మెద్ మోజం ఖాన్ తో పాటు ఇతర నాయకులు పాల్గొన్నారు.