నల్లగొండ జులై 6,(ఇయ్యాల తెలంగాణ ):నల్లగొండ లో డాక్టర్. బాబూ జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా అయన విగ్రహానికి భువనగిరి ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నివాళులు అర్పించారు. ఎంపి మాట్లడుతూమాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ కేవలం దళితుల కోసమే కాదు అన్ని వర్గాల వారి అభ్యున్నతి గురించి ఆలోచించిన మహనీయుడు. వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. దేశంలో వ్యవసాయ రంగం ఇంత పురోగతి సాధించిందంటే అది జగ్జీవన్ రామ్ ముందుచూపు వల్లే. ఆ మహనీయుడి వర్ధంతి సందర్భంగా నల్గొండలోని ఆయన విగ్రహానికి నివాళులు అర్పించాం. నేను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఈ విగ్రహం ఏర్పాటైంది. ఇది నా అదృష్టంగా భావిస్తున్నా. ఆనాడు లోక్ సభ స్పీకర్ గా ఉన్న ఆయన కుమార్తె విూరా కుమార్ గారిని తీసుకొచ్చి జగ్జీవన్ రామ్, డా. బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ ఇద్దరి మహనీయుల విగ్రహాలు పక్కపక్కనే ఎక్కడా లేవు. మన నల్గొండలోనే ఏర్పాటు చేశాం. జగ్జీవన్ రామ్ ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వాలు, నాయకులు నడవాలని అన్నారు..