హైదరాబాద్, మార్చి 25 (ఇయ్యాల తెలంగాణ) : డిల్లీ వేదికగా బీసీ ల సమస్యల సాధనలో భాగంగా ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు పేట్టేలా కార్యాచరణ ను ముమ్మరం చేసినట్లు నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ దాసు సురేష్ ఒక పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన కార్యాచరణను వివరిస్తూ దేశంలో బీసీల జన గణన, పారిశ్రామిక, వాణిజ్య, విద్యా, ఉద్యోగ, సహజ ఆర్ధిక వనరులలో బీసీలకు సమాన వాటా, 50శాతం చట్ట సభల్లో బీసీ రిజర్వేషన్ల అమలు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ మాదిరిగా బీసీలకు సహీతం సామాజిక భద్రతను కల్పించే బిల్లు యొక్క ఆవశ్యకతను తెలియ జేప్పే నివేదిక ప్రతులను వివిధ రాజకీయ పార్టీలకు అందజేసినట్లు తెలిపారు. త్వరలో అన్ని పార్టీల ఎంపీలతో సన్నాహాక సమావేశ ఏర్పాటుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు ప్రెసిడెంట్ దాసు సురేష్ పేర్కొన్నారు.

