ఎమ్మిగనూరు జులై 3, (ఇయ్యాల తెలంగాణ ): ఎమ్మిగనూరు పట్టణంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఎమ్మిగనూరు శాఖ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ఏబీవీపీ నాయకులు బాబా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జులై 05 న పాఠశాలల బంద్ కు పిలుపునిచ్చిందని తెలిపారు. ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల ఫీజు ల దోపిడీకి వ్యతిరేకంగా, ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ల నియామకం జరపాలని, నారాయణ, శ్రీ చైతన్య ,భాష్యం లాంటి కార్పొరేట్, మరియు ప్రైవేటు పాఠశాలలో పుస్తకాలు , ఏక రూప దుస్తులు విక్రయాలు అరికట్టాలని, ఈ ` టెక్నో, స్మార్ట్ ఒలంపియాడ్, ఇంటర్నేషనల్ లాంటి బ్రాండ్ల పేర్లతో దోపిడీని అరికట్టాలని, సీబీఎస్ఈ పేరుతో ప్రైవేటు మరియు కార్పొరేట్ పాఠశాలలో అధిక ఫీజులు వసూలను నియంత్రణ చేయాలి, ప్రభుత్వ నియమ నిబంధనలు పాటించకుండా ఎటువంటి అనుమతులు లేకుండా కార్పొరేట్ మరియు ప్రైవేటు పాఠశాలలు అక్రమంగా నిర్వహిస్తున్న వసతి గృహాలు పై ఆకస్మిక తనిఖీలు చేసి వారి పై చర్యలు తీసుకోవాలని, డి ఎస్ సి ద్వారా ఖాళీగా ఉన్న 30 వేలకు పైగా టీచర్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలి ప్రభుత్వ పాఠశాల లో త్వరగతిన పుస్తకాలు, ఏకరుప దుస్తులు విద్యార్థులకు అందించాలి, ఫీజుల నియంత్రణ కొరకు జిల్లా స్థాయిలో, విద్యాశాఖ అధికారులు, తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల భాగస్వామ్యంతో కమిటీలను వేయాలని డిమాండ్ చేశారు.కావున పాఠశాల యాజమాన్యాలు సహకరించి బంద్ ను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్తిక్, రాజశేఖర్ మరియు ప్రకాశ్ లు పాల్గొన్నారు