
యాదగిరిగుట్ట, సెప్టెంబర్ 24 (ఇయ్యాల తెలంగాణ) : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నర్సింహ స్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారిగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ మెంబర్ సెక్రెటరీ జీ.రవినాయక్ నియమితులయ్యారు . ప్రస్తుత కార్యనిర్వహణాధికారి వెంకట్రావు తన వ్యక్తిగత అవసరాల రీత్యా నెలరోజుల పాటు సెలవులో వెళ్తుండగా, ఆయన స్థానంలో పూర్తిస్థాయి ఇన్చార్జి ఈవోగా రవినాయక్ ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో యాదాద్రి భువనగిరి జిల్లా జాయింట్ కలెక్టరేట్ గా పని చేసిన అనుభవం ఉండటంతో ఆయనకు ఈ బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది.గురువారం ఆలయ దేవస్థానం ఈవోగా రవి నాయక్ బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది.
