Yadagiri గుట్ట దేవస్థానం లో.. ప్రక్షాళనకు పది కమిటీలు

నిర్వహణ లోపాల  నివారణే కమిటీల ధ్యేయం

యాదగిరిగుట్ట, జూలై 28 (ఇయ్యాల తెలంగాణ) : తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానం పాలన కొత్త పుంతలు తొక్కుతోంది. పాలనలో పారదర్శకత లోపాల నివారణ కోసం ప్రక్షాళనకు దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎస్‌ వెంకట్రావు ప్రక్షాళన చర్యలు చేపట్టారు. భక్తులకు మెరుగైనతీ సౌకర్యాలు దర్శనాలు కల్పించేందుకు పది కమిటీలను నియమించారు. పాలనాపరంగా నిర్వహణలో అన్ని విభాగాలలో పారదర్శకత పాటించేందుకు లోపాలను నివారించేందుకు అంతర్గతంగా ఆడిటు చేసుకునేందుకు అదేవిధంగా భక్తులు స్థానికుల నుండి ఎలాంటి ఫిర్యాదులు లేకుండా చూసేందుకు కమిటీలను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు దేవస్థానంలోని అన్ని విభాగాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ తమ దృష్టికి వచ్చిన లోపాలను సూచనలను దేవస్థానం కార్యనిర్వహణాధికారి దృష్టికి తీసుకువచ్చే విధంగా ఈ కమిటీలు పరిచారని నిర్ణయించారు దేవస్థానం కార్య నిర్వహణ అధికారి ఈ పది కమిటీలకు చైర్మన్గా వ్యవహరిస్తారు దేవస్థానం అధికారులు సిబ్బందిని సభ్యులుగా నియమిస్తూ కమిటీలను ఏర్పాటు చేశారు.

పది కమిటీలు ఇవే….!

1) దేవాలయం, ప్రసాదాలు, అన్నదానం పర్యవేక్షణ కమిటీ .

2)  క్రౌడ్‌ మేనేజ్మెంట్‌ కమిటీ.

3) సేఫ్టీ అండ్‌ సెక్యూరిటీ ఓవర్‌ సైట్‌ కమిటీ.

4)  పారిశుద్ధ్యం, పరిశుభ్రత పర్యవేక్షణ కమిటీ.

5)  విద్యుత్‌ ,సీసీ కెమెరాలు, వైర్లెస్‌ వ్యవస్థ, బ్యాటరీ వాహనాలు, ఏసీలు, లిఫ్టుల పర్యవేక్షణ కమిటీ.

6) వసతి సౌకర్యాల పర్యవేక్షణ కమిటీ .

7) విద్యాసంస్థల పర్యవేక్షణ కమిటీ.

8) రెవెన్యూ యాజమాన్య కమిటీ .

9) లీజులు, కిరాయి యాజమాన్య కమిటీ.

10) అకౌంట్స్‌ మేనేజ్మెంట్‌ కమిటీ.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....