వృత్తిదారుల సమస్యలు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కు వినతి

హైదరాబాద్‌, జూన్‌ 20, (ఇయ్యాల తెలంగాణ) : తెలంగాణ రాష్ట్రంలో అత్యంత కన్నుల పండుగగా ఆషాడ మాసంలో నిర్వహించే  బోనాలు జాతరకు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పాతనగరంలోని ఉమ్మడి దేవాలయాల వృత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో గ్రేటర్ హైదరాబాద్ జిల్లా కలెక్టర్ దాసరి హరి చందనను కలిసి వృత్తిదారుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా వృత్తి దారుల సంఘం సభ్యులు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కు తమ సమస్యలతో కూడిన విఙ్ఞాపణ పత్రాన్ని కలెక్టర్ కు అందజేశారు. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర దేవదాయ శాఖ నుండి గుర్తింపు కార్డు, యూనిఫామ్ లాంటి సదుపాయాలు కల్పించడంతో పాటు ఆయా కులస్తులకు కమిటీలు ఏర్పాటు చేయవలసిందిగా వారు కలెక్టర్ ను  కోరడం జరిగింది.  పాతనగరంలో బోనాల పండుగ ఎంతో చరిత్ర కలిగిన వేడుక అని,  అనాదిగా పూర్వీకుల నుంచి అందించిన బోనాల జాతరకు వృత్తి దారులు తమ తమ ఆనవాయితీ ప్రకారం వృత్తి నిర్వహిస్తూ వస్తున్నారు. 

తెలంగాణ రాష్ట్రంలోని ఏకైక పండుగ  బోనాల పండుగ అని ఈ బోనాల పండుగ ఎన్నో ఉన్నతమైన పండగల కన్నా అంగరంగ వైభవంగా గ్రామ దేవతలకు విశిష్ట సేవలు అందిస్తూ విశిష్ట పూజలు చేస్తూ వస్తున్న వృత్తి దారులకు సరైన గుర్తింపు అందడం లేదని, వారు కోరారు. ఇప్పటికైనా ప్రభుత్వం వృత్తిదారులను గుర్తించి వారి సమస్యలను పరిష్కరించాలని సంఘం సభ్యులు కోరారు. ఈ మేరకు కలెక్టర్ ను కలసి వినతి పత్రం అందజేశారు. సానుకూలంగా స్పందించిన హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన వృత్తి దారుల సంఘానికి  అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వృత్తి దారుల సంఘం  అధ్యక్షులు పేరోజి మహేశ్వర్ ప్రధాన కార్యదర్శి కొల్లూరు జ్ఞానేశ్వర్ కోశాధికారిగా గట్టు సుదర్శన్ సలదారులు నాగిల కృష్ణ బొమ్మరాజు దేవేందర్ పేరోజి ప్రదీప్ కుమార్ వైస్ ప్రెసిడెంట్ కొల్లూరు వెంకటేష్ దేవులపల్లి పాండు  బర్రెల జగదీష్ ముష్కిపేట శ్రీకాంత్ గుండ్ర నవీన్ కుమార్ చింతమల్ల మల్లేష్ కుల్పగిరి రామకృష్ణ గోవర్ధన్ చారి తదితరులు పాల్గొన్నారు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....