విద్యా సమస్యలపై చర్యలు తీసుకోవాలి : ABVP

హైదరాబాద్, సెప్టెంబర్ 12 (ఇయ్యాల తెలంగాణ) : ఏబీవీపీ ఫలక్‌నుమా టౌన్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించి, గురుకులాలు మరియు సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో సమస్యలను పరిష్కరించడంతో పాటు మౌలిక వసతులను మెరుగుపరచాలని డిమాండ్ చేసింది.

ఫలక్‌నుమా టౌన్ కార్యదర్శి యశ్వంత్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా రూ.8,700 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు పెండింగ్‌లో ఉండగా విద్యార్థులు నాసిరకమైన వసతులు, ఆహార సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని, పలువురు చదువులు మానేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. రెండు సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం విద్య రంగాన్ని విస్మరించిందని ఆరోపించారు.

స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను తక్షణమే విడుదల చేసి, హాస్టళ్లలో నాణ్యమైన భోజనం, వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ, లేనిపక్షంలో ఉద్యమాలు చేపట్టాల్సి వస్తుందని ఏబీవీపీ హెచ్చరించింది. ఈ కార్యక్రమంలో టౌన్ కార్యదర్శి యశ్వంత్, వైస్ ప్రెసిడెంట్ రుద్రవీర్, జాయింట్ సెక్రటరీలు అభిషేక్, అఖిల్ పాల్గొన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....