నిజామాబాద్, సెప్టెంబర్ 6, (ఇయ్యాల తెలంగాణ) : కామారెడ్డి జిల్లాలో డెంగ్యూ పంజా విసురుతుంది. మరోవైపు చిన్నారులకు సర్ది దగ్గు వైరల్ జరాలతో సతమతమవుతున్నారు. జిల్లా కేంద్ర ఆస్పత్రి ఉన్న సరిపడ మందులు కూడా అందుబాటులో ఉండడం లేదు. మరోవైపు వైద్య సేవలు కంటి తుడుపు చర్యలుగా చేపడుతున్నారని రోగులు ఆరోపిస్తున్నారు. ప్లేట్ ప్లేట్లు తగ్గి ఆసుపత్రుల పాలవుతున్నారు.సరైన అవగాహన లేక వ్యాధి బారిన పడుతున్నారని వైద్యులు అంటున్నారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే వైరల్ పేవర్, డెంగ్యూ, గూనియా లాంటి ప్రాణాంతక వ్యాధులు దరిచేరవని వైద్యులు పేర్కొంటున్నారు. ప్రభుత్వాసుపత్రులకు వస్తున్న రోగులను కొందరు వైద్యులు ప్రైవేట్ క్లినిక్లు ఏర్పాటు చేసుకొని అక్కడికి రెఫర్ చేస్తున్నట్లు రోగుల ఆరోపిస్తున్నారు.కామారెడ్డి జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, బిచ్కుంద ప్రభుత్వ ఆసుపత్రిలో డెంగ్యూ బారిన పడి రోగులు చికిత్స పొందుతుండగా మరి కొంతమంది రోగులు ప్రవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు సమయానికి రావడంలేదని రోగు లు ఆరోపిస్తున్నారు. వచ్చిన రోగులకు వైద్య సేవలను కంటి తుడుపు చర్యగా సేవలందిస్తున్నారని రోగులు పేర్కొంటున్నారు.
ప్రైవేట్ క్లినిక్ ఏర్పాటు చేసుకొని ఎక్కువ శ్రద్ధ ప్రైవేట్ ఆస్పత్రులపైనే వైద్యులు మోగ్గు చూపుతున్నారని రోగుల ఆరోపిస్తున్నారు. ప్రతిరోజు కామారెడ్డి జిల్లా కేంద్ర ఆస్పత్రికి ఓపి రోగులు 500 వరకు వస్తుండగా అడ్మిట్ మాత్రం 50 వరకు మాత్రమే రోగులు చేరుతున్నారు.మిగతా రోగులు ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్సలు పొందుతున్నారు. ప్రైవేట్ ఆస్పత్రి లలో ప్రైవేటు పరీక్షలు చేయిస్తూ వేల రూపాయలు దండుకుంటున్నారు. ఒక్కో పరీక్ష కు 50 శాతం డబ్బులు రేపర్ చేసిన వైద్యునికి మిగతా 50 శాతం డబ్బులు పరీక్ష కేంద్రం నిర్వాహకులకు పంచుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి.పర్యవేక్షించాల్సిన వైద్యాధికారులు పట్టించుకోకుండా నెలసరి మామూళ్లకు అలవాటు పడి చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం డెంగ్యూ, చికెన్ గున్యా, సర్ది ,దగ్గు, వైరల్ ఫీవర్లతో ప్రజలు సతమతమవుతున్నారు. ప్రభుత్వాసుపత్రులతో పాటు ప్రైవేట్ ఆస్పత్రిలో సైతం రోగులు కిటకిటలాడుతున్నారు. సీజనల్ వ్యాధులు అంటూ వైద్యులు చెప్తున్నారు.