తుంగభద్ర జలాశయానికి వరద ఉధృతి

హైదరాబాద్‌ , జూలై 28 (ఇయ్యాల తెలంగాణ) : తుంగభద్ర జలాశయానికి వరద ఉధృతి పెరుగుతుంది. దీనితో తుంగభద్ర ప్రాజెక్టు 24 గేట్లు ఎత్తివేసి వరదనీటిని క్రిందికి వదులుతున్నారు.  తుంగభద్ర జలాశ యానికి ఇన్‌ ఫ్లో 96, 836 క్యూసెక్కులు ఉండగా ప్రాజెక్టు 24 గేట్లు ఎత్తి 1,00, 720 క్యూసెక్కులు నీటిని దిగువకు అధికారులు విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 105 టిఎంసిలుగా ఉండగా ప్రస్తుత నీటి నిల్వ 75 టిఎంసిలుగా ఉంది. గేట్ల సమస్య కారణంగా ఈ ఏడాది 80 టిఎంసిలే అధికారులు నిల్వ చేస్తున్నారు. తుంగభద్ర ప్రాజెక్టు పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచించారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....