TS INTER RESULTS – విడుదల తేదీపై కొనసాగుతున్న ఉత్కంఠ

ఇంటర్‌ ఫలితాల విడుదల తేదీపై తొలగని ఉత్కంఠత

హైదరాబాద్‌, జూన్‌ 26, (ఇయ్యాల తెలంగాణ)

 తెలంగాణ ఇంటర్‌ ఫలితాల విడుదల తేదీపై ఉత్కంఠత కొనసాగుతోంది. ఫలితాలు ఈరోజు, రేపు అన్నట్లు వ్యవహారం నడుస్తోంది. తెలంగాణలో ఇంటర్మీడియట్‌ పరీక్షలు మే 24వ తేదీన పూర్తయ్యాయి. ఆ సమయంలో 20 రోజుల తర్వాత ఫలితాలను విడుదల చేయనున్నట్లు ఇంటర్‌ బోర్డ్‌ అధికారులు ప్రకటించారు. ఆ లెక్కన చూసుకుంటే జూన్‌ 15న ఫలితాలు వస్తాయని అందరూ అంచనా వేశారు. కానీ ఈ తేదీ మారుతూనే ఉంది. మొన్నటి మొన్న విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి జూన్‌ 25 నాటికి ఫలితాలను విడుదల చేయాలని ఆదేశించినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈక్రమంలోనే ఫలితాలు ఆలస్యమైనా పర్లేదు కానీ ఫలితాల్లో ఎలాంటి తప్పులు దొర్లకూడదని తెలిపారని వార్తలు వచ్చాయి.దీంతో శనివారం ఫలితాలు వస్తాయని అందరూ భావించారు. కానీ రిజల్ట్స్‌పై మాత్రం ఎలాంటి క్లారిటీ రాలేదు. 

అయితే తాజాగా తెలుస్తోన్న సమాచారం మేరకు జూన్‌ 27న (సోమవారం) ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. శని, ఆదివారాల నేపథ్యంలో సోమవారం ఫలితాలను విడుదల చేయడానికి ఇంటర్‌ బోర్డ్‌ సుముఖంగా ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఇప్పటికే టెక్నికల్‌ వర్క్‌ కూడా పూర్తయిందని సమాచారం. ఇంటర్‌ ఫలితాలు విడుదలైన వెంటనే విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు.ఇదిలా ఉంటే తెలంగాణలో మొత్తం 9,07,393 మంది విద్యార్థులు ఇంటర్మీడియర్‌ పరీక్షలు రాయగా.. వీరిలో ఇంటర్‌ ఫస్టియర్‌, సెకండియర్‌ జనరల్‌, వొకేషనల్‌ విద్యార్థులు ఉన్నారు. ఫలితాల తేదీలు పలుసార్లు వాయిదా పడుతుండడంతో విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. మరి సోమవారమైనా ఫలితాలు విడుదలవుతాయో లేదో చూడాలి. ఇదిలా ఉంటే ఫలితాల విడుదలపై ఆలస్యంపై ఇంటర్‌ బోర్డ్‌ కూడా ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోవడం గమనార్హం.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....